ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు అనే లవకుశ పాట టాలీవుడ్ కు అచ్చంగా సరిపోతుంది. కొన్ని కాంబినేషన్లు రూపొందే తీరు అలాగే ఉంటుంది. ఒక రీమేక్ మినహాయించి అర్జున్ రెడ్డి, యానిమల్ కేవలం రెండు సినిమాలతో ప్యాన్ ఇండియా ఇమేజ్ సృష్టించుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు మార్కెట్ లో ఎంత డిమాండ్ ఉందో చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం స్పిరిట్ తాలూకు పనుల్లో బిజీగా ఉన్న ఈ క్రియేటివ్ డైరెక్టర్ ఎప్పుడెప్పుడు ఈ ప్రాజెక్టు మొదలుపెడతాడాని ప్రభాస్ అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈ వేసవి నుంచే ప్రారంభమయ్యే సూచనలు పుష్కలంగా ఉన్నాయి.
ఇదిలా ఉండగా సందీప్ వంగా చేతిలో ఉన్న కమిట్ మెంట్స్ తర్వాత లిస్టులో ఉన్నవి యానిమల్ పార్క్, అల్లు అర్జున్ 24. అయితే బన్నీది ఇప్పట్లో సాధ్యమయ్యే అవకాశాలు తక్కువగా ఉండటంతో దాని స్థానంలో రామ్ చరణ్ తో ఒక సినిమా చేసే ఆలోచనలో సందీప్ వంగా ఉన్నట్టు లేటెస్ట్ గాసిప్. దీనికి సంబంధించి ఒక రౌండ్ చర్చలు కూడా జరిగాయి కానీ కార్యరూపం దాల్చడానికి టైం పట్టొచ్చని వినికిడి. పెద్ది అయ్యాక చరణ్ సుకుమార్ తో అనుకున్న ఆర్సి 17 కాస్తా నెంబర్ మారి 18 అవ్వొచ్చట. దీని స్థానంలో కిల్ దర్శకుడు నిఖిల్ నగేష్ భట్ చేయొచ్చనే ప్రచారం మళ్ళీ మొదలయ్యింది. నిర్ధారణగా తెలియాల్సి ఉంది.
స్పిరిట్ పూర్తయ్యాక రన్బీర్ కపూర్ ఫ్రీగా ఉంటేనే యానిమల్ పార్క్ సాధ్యమవుతుంది. అతనేమో రామాయణ రెండు భాగాలు, లవ్ అండ్ వార్, ధూమ్ 4తో అంత సులభంగా దొరికేలా లేడు. సో ఈ గ్యాప్ తో చరణ్ తో సందీప్ వంగా చేతులు కలిపితే మంచి నిర్ణయమే. కానీ ఇదంతా ప్రాధమికంగా తెలుస్తున్న సమాచారమే కాబట్టి నిజమయ్యే దాకా అంత సులభంగా నమ్మలేం. గేమ్ చేంజర్ కోసం అనవసరంగా మూడు సంవత్సరాలు వృథా చేసుకున్న రామ్ చరణ్ ఇకపై అలా జరగకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మరి పైన చెప్పినట్టు నిజంగా సందీప్ వంగాతో సంధి కుదిరితే మాత్రం సెన్సేషన్ అవుతుంది.
This post was last modified on April 15, 2025 8:59 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…