Movie News

లాభం లేదబ్బాయ్….రూటు మార్చెయ్

హాస్య నటులు హీరోలు కావొచ్చేమో కానీ యాంకర్లు కథానాయకులుగా వెలుగొందటం అంత సులభం కాదు. నాలుగేళ్ల క్రితం ప్రదీప్ మాచిరాజు 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ఓ మోస్తరు సక్సెస్ అందుకుంది. ముఖ్యంగా నీలి నీలి ఆకాశం పాట ఓపెనింగ్స్ కి బాగా దోహదం చేయడమే కాక ప్రదీప్ కో మంచి హిట్టు దక్కేలా చేసింది. ఆ తర్వాత కొందరు నిర్మాతలు, దర్శకులు తనతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపించారు కానీ కథలు నచ్చకపోవడం వల్లో లేక ఇంకేదైనా కారణమో కానీ వెండితెరకు చాలా గ్యాప్ తీసుకున్నాడు. యాంకర్ గా ప్రస్థానం కొనసాగిస్తూ శాటిలైట్ చానెల్స్, ఓటిటిలో బిజీగా మారిపోయాడు.

మొన్న శుక్రవారం సిల్వర్ స్క్రీన్ రీ ఎంట్రీ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ డెబ్యూ మూవీ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి టైటిల్ పెట్టేసుకున్నాడు. అర్జున్ రెడ్డి ఫేమ్ రధన్ తో సంగీతం చేయించుకుని పెద్ద క్యాస్టింగ్ సెట్ చేసుకున్నాడు. దర్శకులు నితిన్ – భరత్ ని పూర్తిగా నమ్మేశాడు. ప్రమోషన్లు బాగానే చేశారు. బాక్సాఫీస్ దగ్గర సరైన సినిమా లేకపోవడంతో ఎంటర్ టైన్మెంట్ పరంగా ప్రేక్షకులకు తమదే బెస్ట్ ఛాయస్ అవుతుందనుకున్నారు. తీరా చూస్తే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయికి ఆశించిన ఫలితం రాలేదు. ఓపెనింగ్స్ జస్ట్ ఓకే అనిపించగా రివ్యూలు, పబ్లిక్ టాక్స్ అబ్బే లాభం లేదని పెదవి విరిచేశాయి.

కామెడీని హ్యాండిల్ చేయడంలో దర్శకులు పడిన తడబాటు దీన్నో యావరేజ్ కన్నా తక్కువ చిత్రంగా మార్చేశాయి. ముఖ్యంగా సెకండాఫ్ పెద్ద దెబ్బ కొట్టింది. రెగ్యులర్ గా కనిపిస్తూ వరుసగా సినిమాలు చేస్తూ ఉంటే ప్రేక్షకులతో కనెక్టివిటీ ఉంటుంది. అలా కాకుండా అయిదేళ్లకోసారి కనిపిస్తే జనాన్ని పుష్ చేయడం కష్టమవుతుంది. హిట్టో ఫ్లాపో చైన్ కొనసాగుతూ ఉంటేనే హీరోలను పబ్లిక్ గుర్తు పెట్టుకుంటారు. ఇంత గ్యాప్ తీసుకుని అది కూడా ఇలాంటి కంటెంట్ తో వస్తే కష్టం. ఇకపై ప్రదీప్ వేగంగా సినిమాలు చేయడమో లేక మంచి కెరీర్ ఇస్తున్న బుల్లితెరపై కంటిన్యూ అయిపోవడంమో ఏదో ఒకటి చేయడం బెటర్.

This post was last modified on April 15, 2025 4:11 pm

Share

Recent Posts

గిన్నిస్ బుక్కంటే క్రేజ్ తగ్గిందనుకోవాలా

ఒకప్పుడు గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డులో పేరు సంపాదించుకోవడమంటే అదో పెద్ద ఘనతగా భావించే వాళ్ళు. పెద్ద పెద్ద…

5 minutes ago

నంది అవార్డులు వచ్చేస్తున్నాయహో…

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వం ప్రకటించే నంది అవార్డుల‌కు ఎంత విలువ ఉండేదో తెలిసిందే. వాటిని జాతీయ అవార్డుల‌తో స‌మానంగా చూసేవారు.…

2 hours ago

ఆలస్యం జరిగింది ఇక ఆగడం ఉండదు

టాలీవుడ్ సినిమాలకు అదేం శాపమో అర్థం కాదు కానీ కొన్నింటికి ప్రభుత్వాల నుంచి జిఓలు సకాలంలో రావు, చివరి నిమిషం…

3 hours ago

వందేమాత‌రంపై కేంద్రానికి సుప్రీంకోర్టు షాక్‌?

జాతీయ గేయం వందేమాత‌రం వ్య‌వ‌హారంపై జ‌రుగుతున్న వివాదాలు అన్నీ ఇన్నీ కావు. దేశానికి స్వాతంత్రం రాక మునుపు నుంచి ఈ…

3 hours ago

కలెక్షన్ కింగ్ అందుకే వెనుక ఉన్నారా

ఒకప్పుడు కలెక్షన్ కింగ్ గా తొంభై దశకంలో స్టార్ హీరోలకు బలమైన పోటీ ఇచ్చిన మోహన్ బాబుకి ఇప్పటికీ ఫాలోయింగ్…

4 hours ago

జడల్ జమానాకు సెన్సార్ ట్విస్టులు

ప్యారడైజ్ సెన్సార్ అయిపోయింది. ఊహించినట్టే ఏ సర్టిఫికెట్ వచ్చింది. 2 గంటల 54 నిమిషాల సవారి జాతి ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు…

5 hours ago