మంచు ఫ్యామిలీ గొడవ గత కొన్ని రోజులుగా మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోన సంగతి తెలిసిందే. తండ్రీ కొడుకులు.. అన్నదమ్ములు అంటే ఇలా ఉండాలి అన్నట్లుగా ఎంతో అన్యోన్యంగా ఉన్న మంచు కుటుంబ సభ్యుల్లో ఇటీవల అనూహ్యంగా విభేదాలు తలెత్తాయి. మోహన్ బాబు, విష్ణు ఒక వైపు నిలిస్తే.. మనోజ్ వారికి దూరం అయిపోయాడు. విష్ణు, మనోజ్ సవతి సోదరులు అనే విషయం జనం గుర్తించనంతగా.. ఒక కడుపునే పుట్టినంత అన్యోన్యంగా ఉండేవారు. కానీ ఇప్పుడు మొత్తం పరిస్థితి మారిపోయింది. ఇద్దరూ శత్రువులైపోయారు. మోహన్ బాబు సైతం మనోజ్‌ను దూరం పెట్టడం.. కొడుకు మీద అనేక ఆరోపణలు చేయడం.. మనోజ్ సైతం మోహన్ బాబు-విష్ణుల మీద అభియోగాలు మోపడం చర్చనీయాంశంగా మారింది.
ఈ కుటుంబం ఇలా రోడ్డున పడడం వారి అభిమానులకు అస్సలు నచ్చట్లేదు. మధ్యలో గొడవ కాస్త సద్దుమణిగినట్లు కనిపించినా.. మళ్లీ ఇటీవల జల్‌పల్లిలోని మోహన్ బాబు ఇంటి ముందు మనోజ్ నిరసనకు దిగడం, అనేక ఆరోపణలు చేయడంతో వ్యవహారం మొదటికి వచ్చింది. ఐతే ఈ గొడవ అంతకంతకూ పెరుగుతుండగా.. విష్ణు, మనోజ్‌ల సోదరి మంచు లక్ష్మి ఏం చేస్తోంది, అన్నదమ్ముల మధ్య రాజీకి ఆమె ప్రయత్నించడం లేదా అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. బహుశా ఆమె ఆ ప్రయత్నం చేస్తుండొచ్చు. అది బయటికి కనిపించడం లేదు. అన్నదమ్ముల గొడవ ఆమెను ఎంత వేదనకు గురి చేస్తోందో తెలియజేసే వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఒక ఈవెంట్లో పాల్గొన్న మంచు లక్ష్మిని మనోజ్ సర్ప్రైజ్ చేశాడు. వెనుక నుంచి ఆమెను మనోజ్ పట్టుకోవడం.. ఆమె అతణ్ని చూడగానే ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకోవడం.. తర్వాత మనోజ్ భార్య మౌనిక ఆమెను ఓదార్చే ప్రయత్నం చేయడం.. ఇలా మొత్తంగా వీడియో చూసే వాళ్లను కదిలించేస్తోంది. ఏ కుటుంబానికీ ఇలాంటి పరిస్థితి రాకూడదనే ఎవరైనా అనుకుంటారు. వీలైనంత త్వరగా విష్ణు, మనోజ్ మధ్య విభేదాలు సమసిపోయి.. కుటుంబమంతా కలిసి పోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ విషయంలో మంచు లక్ష్మి గట్టిగా ప్రయత్నిస్తే అనుకున్నది జరుగుతందని అభిప్రాయపడుతున్నారు.
This post was last modified on April 13, 2025 9:48 pm
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…