నారా రోహిత్ కొత్త సినిమా సుందర కాండ టీజర్ వచ్చి తొమ్మిది నెలలు దాటేసింది. అప్పుడెప్పుడో సెప్టెంబర్ రిలీజ్ అనుకున్నారు కానీ పోటీ వల్ల వాయిదాలు వేసుకుంటూ పోయారు. తర్వాత అందరూ మర్చిపోయారు. ప్రభాస్ మొదటి సినిమా ఈశ్వర్ లో హీరోయిన్ గా నటించిన శ్రీదేవి విజయ్ కుమార్ ఈ సినిమాతోనే టాలీవుడ్ రీ ఎంట్రీ ఇస్తోంది. సుందరకాండ ఈవెంట్ కొచ్చి తన ఆనందాన్ని పంచుకుంది కూడా. వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహించిన ఈ కామెడీ ఎంటర్ టైనర్ కు లియోన్ జేమ్స్ సంగీతం సమకూర్చగా క్యాస్టింగ్ పెద్దదే ఉంది. ఇదంతా బాగానే ఉంది కానీ మౌనం వహించడమే ట్విస్ట్.
అంతర్గత సమాచారం మేరకు సుందరకాండకు ఇంకా ఓటిటి డీల్స్ కాలేదట. థియేట్రికల్ బిజినెస్ ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాకపోవడంతో ప్రమోషన్లు చేయడం ద్వారా బయ్యర్లను ఆకట్టుకునే ప్లాన్ లో ఉన్నట్టు తెలిసింది. కొన్ని ఆర్థికపరమైన చిక్కులు కూడా స్పీడ్ బ్రేకర్స్ అయ్యాయని వినికిడి. ఇవన్నీ వీలైనంత త్వరగా క్లియర్ చేసుకోవాలి. అసలే వేసవి సగం అయిపోయింది. మంచి డేట్లన్నీ లాక్ అవుతున్నాయి. సుందరకాండ మాత్రం మీనమేషాలు లెక్కేయడం కరెక్ట్ కాదు. దీనికన్నా చాలా ఆలస్యంగా మొదలైన నారా రోహిత్ మరో సినిమా భైరవం సైతం రిలీజ్ డేట్ కోసం తంటాలు పడుతోంది.
దీని సంగతలా ఉంచితే ఈ సమస్య ఒక్క సుందరకాండకే కాదు ఎన్నో సినిమాలకు వస్తోంది. ముఖ్యంగా మిడ్ రేంజ్, చిన్న చిత్రాలు పడుతున్న కష్టాలు అన్ని ఇన్ని కావు. బజ్ లేకపోతే ఓపెనింగ్స్ రావు. టాక్ తేడా కొడితే రెండో రోజే డెఫిషిట్లు. ఇవన్నీ చూసి ఓటిటిలు గీచి గీచి బేరాలు ఆడటం. కంటెంట్ బలంగా ఉంటే ఇవేవి ఇబ్బంది పెట్టవు. మెల్లగా అయినా సరే హక్కుల కోసం ఎగబడటం మొదలవుతుంది. కాకపోతే రైలు జీవిత కాలం లేటు తరహాలో మరీ ఆలస్యం జరగకుండా చూసుకోవాలి. వెంకటేష్ సూపర్ హిట్ టైటిల్ ని పెట్టుకున్న సుందరకాండ వీలైనంత త్వరగా మోక్షం దక్కించుకునే మార్గాలు వెతుక్కోవాలి.
This post was last modified on April 13, 2025 7:36 am
దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమైన పెహల్గామ్ సంఘటన ప్రతి ఒక్కరిని వెంటాడుతూనే ఉంది. అక్కడికి వెళ్లని వాళ్ళు సైతం జరిగిన…
ప్రజా నాయకుడు.. లేదా నాయకురాలు.. కావడానికి జెండా పట్టుకునే తిరగాల్సిన అవసరం లేదని.. ఈ దేశంలో అనేక మంది నిరూపించారు.…
ప్రతి అన్నం మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుందని పెద్దలు ఊరికే అనలేదు. ఇది సినిమా పరిశ్రమకు కూడా…
ఏప్రిల్ 27, బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి(టీఆర్ ఎస్) 25 సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పోరుగల్లు.. ఓరుగల్లు వేదికగా..…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 షూటింగ్ ప్రస్తుతం కేరళలో నాన్…
తమిళ స్టార్ హీరో సూర్యకు ఎంతో కీలకమైన సినిమా.. రెట్రో. కొన్నేళ్లుగా అతడికి విజయాలు లేవు. తన చివరి చిత్రం…