ఈ వారం విడుదల కాబోతున్న అర్జున్ సన్నాఫ్ వైజయంతిలో క్లైమాక్స్ గురించి టీమ్ పదే పదే హైలైట్ చేస్తూ చెప్పడం అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్టుగా వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తాను సినిమా చూశానని, చివరిగా క్లైమాక్స్ లో కంటతడి పెట్టకుండా ఉండటం అసాధ్యమని, ఇంత రిస్క్ కి కళ్యాణ్ రామ్ కు మాత్రమే సాధ్యమయ్యిందని చెప్పడం ఫ్యాన్స్ ఎగ్ జైట్ మెంట్ పెంచింది. అంతగా ఏముందనే సందేహం రావడం సహజం. నిన్న గమనిస్తే తారక్ ఏదో చెప్పబోతూ ఉంటే కళ్యాణ్ రామ్ వద్దని వారిస్తూ సరదాగా తమ్ముడిని నిలువరించే ప్రయత్నం స్టేజి మీదే జరిగింది. అంటే ఏదో పెద్ద ట్విస్టే ఉంది.
దీని గురించి రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి. కథలో కీలకమైన పాత్రలు రెండు. ఒకటి కళ్యాణ్ రామ్, రెండు విజయశాంతి. ఆడియన్స్ ని కంటతడికి గురి చేసే ఎపిసోడ్ అంటే ఖచ్చితంగా వీళ్ళలో ఒకరికి ఏదైనా జరగరానిది జరిగినప్పుడే అంత ఎమోషన్ పండుతుంది. మరి దర్శకుడు ప్రవీణ్ చిలుకూరి దీన్ని ఎలా డిజైన్ చేశాడనేది చూడాలి. పైగా అందరూ చివరి ఇరవై నిమిషాల గురించి ఈ స్థాయిలో ఎలివేట్ చేయడం చూస్తే అదేదో ఆషామాషి వ్యవహారంలా లేదు. కాకపోతే అంతగా మెలితిప్పే ఎమోషన్ ఏమై ఉండొచ్చనే ప్రశ్నకు సమాధానం కావాలంటే ఇంకో అయిదు రోజులు వేచి ఉండాల్సిందే.
ఎడతెరిపి లేకుండా ప్రమోషన్లు చేయడం, విజయశాంతి ఇంత వయసులోనూ ఓపిగ్గా అన్ని చోట్లకు వెళ్లి పబ్లిసిటీలో భాగం కావడం చూస్తే మాస్ లో అర్జున్ సన్నాఫ్ వైజయంతికి మంచి మద్దతు దక్కేలా ఉంది. విరూపాక్ష ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం అందించిన ఈ సినిమాకు తమన్నా ఓదెల 2 నుంచి పోటీ ఉంది. అది ఒక రోజు ముందుగానే రిలీజ్ చేయనుండటం టాక్ పరంగా ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి. బింబిసార తర్వాత కళ్యాణ్ రామ్ కు అంత పెద్ద సక్సెస్ అయితే రాలేదు. ఇప్పుడీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి ఫలితాన్ని బట్టి బింబిసార 2 మీద ఎంత పెట్టుబడి పెట్టాలనేది నిర్ణయించుకోవచ్చు.
This post was last modified on April 13, 2025 10:00 am
టాలీవుడ్లో మంచి అభిరుచి ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు జాగర్లమూడి క్రిష్. తన తొలి చిత్రం గమ్యం ఎంత సంచలనం…
రాజకీయాల్లో తొడ కట్టడం విమర్శలకు గుర్తించడం నాయకులకు వెన్నతో పెట్టిన విద్య. అయితే అందరూ అలా ఉంటారని కాదు కానీ…
90వ దశకంలో తెలుగు సినీ ప్రియులను ఒక ఊపు ఊపిన కథానాయికల్లో రంభ ఒకరు. అసలు పేరు విజయలక్ష్మి అయినప్పటికీ…
ఏపీలో రోజుకో మలుపు తిరుగుతున్న మద్యం కుంభకోణంలో సోమవారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అన్నీ తానై…
వైసీపీ నుంచి బయటకు వచ్చిన రఘురామకృష్ణరాజు.. టీడీపీలో చేరి.. ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ అయ్యారు. ఉండినియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో…
తెలంగాణ గొప్పతనాన్ని దశదిశలా చాటుతామని చెప్పిన వారు... ఏం చేశారో.. ఏమో తెలియదుకానీ.. ప్రస్తుతం సీఎం రేవంత్రెడ్డి మాత్రం నిజంగానే…