తెలుగులో ఒకప్పుడు వెలుగు వెలిగిన నిర్మాతలు చాలామంది కనుమరుగైపోయారు. కానీ అల్లు అరవింద్, సురేష్ బాబు లాంటి కొద్ది మంది ముందుతరం నిర్మాతలు మాత్రమే ఇంకా యాక్టివ్‌గా ఉన్నారు. వీరితో పాటు ఇంకా ఇండస్ట్రీలో కొనసాగుతున్న అతి కొద్ది మంది సీనియర్ నిర్మాతల్లో బీవీఎస్ఎన్ ప్రసాద్ ఒకరు. 1986లో వచ్చిన ‘డ్రైవర్ బాబు’తో మొదలుపెట్టి దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆయన సినిమాలు నిర్మిస్తున్నారు. పుష్కర కాలం కిందట ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ‘అత్తారింటికి దారేది’కి ఆయనే నిర్మాత. మరో ఇండస్ట్రీ హిట్ ‘మగధీర’లో కూడా ఆయన భాగస్వామి.
ఇంకా ఛత్రపతి లాంటి బ్లాక్ బస్టర్.. నాన్నకు ప్రేమతో, ఊసరవల్లి లాంటి పెద్ద చిత్రాలు నిర్మించారు ప్రసాద్. రాజీ లేకుండా సినిమాలు తీస్తారని.. విలువలు పాటిస్తారని ఆయనకు ఇండస్ట్రీలో మంచి పేరుంది.
కానీ ఈ మంచి నిర్మాతకు కొన్నేళ్ల నుంచి అస్సలు కలిసి రావడం లేదు. ఆయన సినిమాలు వరుసగా బోల్తా కొడుతున్నాయి. మరీ దారుణమైన ఫలితాలను అందుకుంటున్నాయి. ‘తొలి ప్రేమ’, విరూపాక్ష’ సినిమాలు బాగా ఆడినా.. మిగతా చిత్రాలన్నీ తేడా కొట్టాయి. మిస్టర్ మజ్ను, సోలో బ్రతుకే సో బెటర్, రంగ రంగ వైభవంగా, గాండీవధారి అర్జున, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో.. ఇలా ఐదేళ్ల వ్యవధిలో ఐదు ఫెయిల్యూర్లు చూశారు. వీటిలో ‘గాండీవధారి అర్జున్’ కొట్టిన దెబ్బ అలాంటిలాంటిది కాదు. పెట్టిన పెట్టుబడి అంతా వేస్ట్ అయిపోయింది.
‘అప్పుడో ఇప్పుడో ఎఫ్పుడో’ కూడా వాషౌట్ అయిపోయింది. ఇప్పుడు ‘జాక్’ మీద ఆయన ఆశలు పెట్టుకున్నారు. ఇది అనివార్య కారణాలతో బాగా ఆలస్యం అయింది. బడ్జెట్ పెరిగిపోయింది. తీరా సినిమా రిలీజ్ చేసే సమయానికి హైప్ రాలేదు. సిద్ధు పేరు మీద కాస్త ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ టాక్ బ్యాడ్ కావడంతో రెండో రోజే సినిమా బాగా డౌన్ అయిపోయింది. అసలే డెఫిషిట్‌లో సినిమాను రిలీజ్ చేశారు. టాక్ బాలేక వసూళ్లు లేవు. దీంతో ప్రసాద్‌కు ఈ చిత్రం పెద్ద నష్టమే మిగిల్చేలా ఉంది. ఇకపై సినిమాలు తీయడమే కష్టమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
This post was last modified on April 12, 2025 2:00 pm
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…