Movie News

ఓహ్ బేబీ….ఇది రెండో నెంబర్ బ్రేకు

రెండేళ్ల క్రితం బేబీ రిలీజ్ ముందు వరకు తనెవరో పెద్దగా పరిచయం లేని పేరు. అల వైకుంఠపురములో అల్లు అర్జున్ చెల్లెలిగా నటించినప్పటికీ అది ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినా ఆమెకొచ్చిన గుర్తింపు తక్కువే. కానీ బేబీ ఒక్కసారిగా జాతకాన్ని మార్చేసింది. ఊహించని స్థాయిలో ఘనవిజయం సాధించి ఏకంగా వంద కోట్లకు దగ్గరగా వెళ్లడం ట్రేడ్ ని విస్మయపరిచింది. పెర్ఫార్మన్స్ పరంగా వైష్ణవి చైతన్యకు చాలా పేరొచ్చిన మాట వాస్తవం. ఇద్దరిని ప్రేమించి ఒకరి జీవితాన్ని నాశనం చేసే పాత్రలో జీవించేసింది. ఇంకొకరు అయ్యుంటే ఇంతగా ఆ క్యారెక్టర్  పండేది కాదేమోనన్న కామెంట్ కూడా నిజమే.

ఇక వర్తమానానికి వస్తే బేబీతో వచ్చిన ఇమేజ్ ని పెంచుకునే క్రమంలో వైష్ణవి చైతన్యకు తప్పటడుగులు పడుతున్నాయి. దిల్ రాజు బ్యానర్ కదాని గుడ్డిగా ఒప్పేసుకున్న లవ్ మీ ఇఫ్ యు డేర్ ఊసులో లేనంత దారుణంగా ఫ్లాప్ అయ్యింది. సినిమా పోతే పోయింది కానీ తనకు కలిగిన ప్రయోజనం సున్నానే. తాజాగా జాక్. సిద్ధూ జొన్నలగడ్డ సరసన అవకాశమంటే ఎవరైనా ఎందుకు కాదంటారు. బొమ్మరిల్లు దర్శకుడు, ఎస్విసిసి లాంటి బడా సంస్థ. ఆలోచించడానికి ఏమి లేదు. ఒప్పేసుకుంది. లేడీ డిటెక్టివ్ గా పేపర్ మీద వెరైటీగా అనిపించిన పాత్ర తెరమీద చూసేసరికి అత్తెసరుగా తేలిపోయి తుస్సుమనిపించింది.

ఇవి వైష్ణవి చైతన్య కావాలని చేసిన ఫ్లాపులు కాకపోయినా ఇకపై మరింత జాగ్రత్తగా ఉండటమైతే అవసరమే. ముఖ్యంగా కాంబోల కన్నా కథల ఎంపిక మీద దృష్టి పెట్టాలి. ప్రస్తుతం తను ఆనంద్ దేవరకొండ కాంబోలో సితార ఎంటర్ టైన్మెంట్స్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ తో పేరు తెచ్చుకున్న ఆదిత్య హాసన్ దర్శకత్వంలో ఇది రూపొందుతోంది. జాక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత మాట్లాడుతూ వైష్ణవి చైతన్యని బ్యాడ్ గా చూపించామని కూడా హింట్ ఇచ్చారు. మరి దీంతో ఏదైనా పెద్ద బ్రేక్ దక్కుతుందేమో చూడాలి. బేబీ జంట కలయిక రిపీట్ అవుతోంది కాబట్టి అంచనాలైతే ఉంటాయి మరి.

This post was last modified on April 12, 2025 3:02 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

‘పవన్ అన్న’ మాటే… ‘తమ్ముడు లోకేష్’ మాట!

కూటమిలో మూడు పార్టీలు.. విభిన్నమైన భావజాలం.. అయినా ఏకతాటిపై నడుస్తున్నాయి. దానికి కారణం రాష్ట్రం బాగుండాలనే సదుద్దేశమే అని పార్టీల…

2 hours ago

అవకాశాన్ని ఆంధ్రకింగ్ వాడుకుంటాడా

రివ్యూస్, పబ్లిక్ టాక్ బాగున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయిన ఆంధ్రకింగ్ తాలూకా రెండో వారం నుంచి పికప్ ఆశిస్తున్నామని…

4 hours ago

అఖండ 2 ఆగింది… అసలేం జరుగుతోంది

బహుశా బాలకృష్ణ కెరీర్ లోనే ఇది మొదటిసారని చెప్పొచ్చు. ఇంకో రెండు మూడు గంటల్లో షోలు ప్రారంభమవుతాయని అభిమానులు ఎదురు…

5 hours ago

అన్నగారు వచ్చేలా లేరు

నిర్మాతలకు వచ్చే ఆర్థిక చిక్కులు పెద్ద రిలీజులను ఎంత ఇబ్బంది పెడతాయో అఖండ 2 విషయంలో చూస్తున్నాం. అయితే ఇలాంటి…

5 hours ago

‘హైదరాబాద్ హౌస్’లో పుతిన్ బస.. ఈ ప్యాలెస్ ఎవరిదో తెలుసా?

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…

10 hours ago

బోకేలు, శాలువాలు లేవు… పవన్ రియాక్షన్ ఏంటి?

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…

13 hours ago