కొన్నిసార్లు బాక్సాఫీస్ ఫలితాలు అనూహ్యంగా ఉంటాయి. టాక్ తేడాగా వచ్చినా, జనానికి పూర్తిగా నచ్చకపోయినా కలెక్షన్లు మాత్రం భీభత్సంగా వచ్చేస్తాయి. ఇటీవలి కాలంలో రెండు ఉదాహరణలు ప్రముఖంగా చెప్పుకోవచ్చు. వాటిలో మొదటిది ఎల్2 ఎంపురాన్. ఫస్ట్ పార్ట్ లూసిఫర్ కి కనీసం దరిదాపుల్లో లేకపోయినా మోహన్ లాల్ ఇమేజ్, ఈ ఫ్రాంచైజ్ కున్న బ్రాండ్ వేల్యూ వల్ల వందలాది కోట్లు వచ్చి పడ్డాయి. ఇప్పుడు కేరళ నెంబర్ వన్ సింహాసనం దక్కించుకుంది. వివాదాలు, విమర్శలు ఎన్ని వచ్చినా తట్టుకుని నిలబడింది. విచిత్రం ఏంటంటే తెలుగుతో సహా ఇతర భాషల్లో ఎల్2 ఎంపురాన్ కి తిరస్కారం ఎదురయ్యింది.
రెండోది గుడ్ బ్యాడ్ అగ్లీ. వింటేజ్ అవతారంలో అజిత్ విశ్వరూపం చూసి ఫ్యాన్స్ వెర్రెత్తిపోతున్నారు. లాజిక్ లేని కథా కథనాలు, విచిత్రమైన క్యారెక్టరైజేషన్లు, మోతాదుకి మించి పాత సినిమాల రెఫరెన్సులు, హోరెత్తే బీజీఎమ్ ఇవన్నీ తలా మేజిక్ ముందు చిన్నబోతున్నాయి. తమిళనాడులో ఈ ఏడాది టాప్ గ్రాసర్ గా నిలిచేందుకు పరుగులు పెడుతోంది. ఓపెనింగ్స్ పరంగా బీస్ట్, లియో, జైలర్ లాంటి వాటిని దాటడం కష్టంగా ఉన్నా యునానిమస్ టాక్ లేని గుడ్ బ్యాడ్ అగ్లీకి జనం బ్రహ్మరథం పట్టడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. ఇది కూడా అచ్చం ఎల్2 లాగే ఒరిజినల్ వెర్షన్ తప్ప ఇతర భాషల్లో సోసోగానే నెట్టుకొస్తోంది.
స్టార్ పవర్ తాలూకు ఇంపాక్ట్ ఈ స్థాయిలో ఉంటుంది. మన దగ్గర కూడా గతంలో ఇలాంటి ఉదాహరణలు బోలెడున్నాయి. అజ్ఞాతవాసి, సర్దార్ గబ్బర్ సింగ్ లు ఎంత డిజాస్టర్ అయినా మొదటి రోజు రికార్డులు గురించి ఫ్యాన్స్ ఇప్పటికీ మాట్లాడుకుంటారు. గుంటూరు కారం డివైడ్ టాక్ తట్టుకుని కొన్ని ఏరియాల్లో బయ్యర్లకు లాభాలిచ్చింది. ఫస్ట్ డే వచ్చిన మిశ్రమ స్పందన తట్టుకుని దేవర అయిదు వందల కోట్లను దాటడం వెనుక కారణం జూనియర్ ఎన్టీఆర్ మాస్ పవరే. సరైన కంటెంట్ పడాలే కానీ ఆకాశమే హద్దుగా మన స్టార్లు చెలరేగిపోతారని చెప్పడానికి గత డిసెంబర్లో వచ్చిన పుష్ప 2 కన్నా వేరే ఎగ్జాంపుల్ అక్కర్లేదుగా.
This post was last modified on April 12, 2025 1:17 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…