హీరోలు మాత్రమేనా పాన్ ఇండియా రేంజికి వెళ్లేది.. నిర్మాతలు వెళ్లలేరా అన్నట్లు బహు భాషల్లో సినిమాలు తీస్తూ దూసుకెళ్తోంది టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. తెలుగులో భారీ చిత్రాలు ప్రొడ్యూస్ చేస్తూ, ఘనవిజయాలు అందుకుంటూ పెద్ద రేంజికి వెళ్లిన మైత్రీ.. ఆల్రెడీ మలయాళంలో టొవినో థామస్ హీరోగా ‘ఏఆర్ఎం’ అనే బిగ్ బడ్జెట్ మూవీతో సక్సెస్ సాధించింది. ఇప్పుడు ఒకేసారి మైత్రీ.. హిందీ, తమిళంలో అడుగు పెట్టింది. ఆ సంస్థ హిందీలో నిర్మించిన చిత్రం ‘జాట్’.. తమిళంలో ప్రొడ్యూస్ చేసిన మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఒకే రోజు విడుదల కావడం విశేషం. గురువారం భారీ అంచనాల మధ్య ఈ మూవీస్ ప్రేక్షకులను పలకరించాయి. రెంటికీ భారీగానే ఓపెనింగ్స్ వచ్చాయి. ముఖ్యంగా తమిళంలో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ తొలి రోజు ప్యాక్డ్ హౌస్‌లతో నడిచింది.
కోలీవుడ్ చరిత్రలోనే అత్యధిక ఓపెనింగ్స్ తెచ్చుకున్న చిత్రాల్లో ఇదొకటిగా నిలిచింది. ఫుల్ రన్లో అనేక రికార్డులనూ బద్దలు కొట్టేలా ఉంది. ఇక ‘జాట్’ కూడా తొలి రోజు థియేటర్లు కళకళలాడించింది. మాస్ సర్క్యూట్లలో ఈ సినిమాకు రెస్పాన్స్ అదిరిపోయింది. ఈ రెండు చిత్రాలకూ భారీగా బిజినెస్ జరిగింది. మైత్రీ సంస్థకు మంచి లాభాలూ వచ్చాయి. కానీ వసూళ్ల పరంగా ఢోకా లేకపోయినప్పటికీ.. కంటెంట్ విషయంలో మాత్రం విమర్శలు తప్పట్లేదు.
ఇవి రెండూ రొటీన్ మాస్ మసాలా సినిమాలే. ప్రధానంగా హీరో ఎలివేషన్లు, యాక్షన్ సీక్వెన్సుల మీదే దృష్టిపెట్టారు. అంతకుమించి కథాకథనాలను పెద్దగా పట్టించుకోలేదు. కమర్షియల్‌గా ఈ సినిమాలు సక్సెస్ అనిపించుకున్నా.. కొన్ని రోజుల తర్వాత అందరూ మరిచిపోతారని.. కంటెంట్ పరంగా మైత్రీ సాధారణమైన సినిమాలే తీసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చిత్రాలతో డబ్బులు వచ్చినా మైత్రీ పేరు చెడడం ఖాయమని అంటున్నారు.
This post was last modified on April 12, 2025 10:29 am
మెగాస్టార్ ఫాంటసీ మూవీ విశ్వంభర నుంచి ప్రమోషన్ పరంగా ఇప్పటిదాకా రెండు కంటెంట్స్ వచ్చాయి. మొదటిది టీజర్. దీనికొచ్సిన నెగటివిటీ…
మాములుగా సీనియర్ దర్శకులకు వరసగా డిజాస్టర్లు పడితే కంబ్యాక్ కావడం అంత సులభంగా ఉండదు. అసలు వాళ్ళ కథలు వినడానికే…
ఇంజెక్షన్ అని వినగానే చిన్న పిల్లలే కాదు, పెద్దవాళ్లలో కూడా భయం కనిపిస్తుంది. దీనికి వైద్య పరంగా ట్రిపనోఫోబియా అని…
ఏపీలో కీలకమైన ఓ రాజ్యసభ సీటు ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా షెడ్యూల్ ప్రకటించింది. వైసీపీ నుంచి…
డీజే దువ్వాడ జగన్నాథంతో ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నా హీరోయిన్ గా తన స్థాయిని అమాంతం పెంచేసిన సినిమాల్లో అల వైకుంఠపురములో…
చాట్ GPT - డీప్ సీక్ - మెటా.. ఇలా ఏఐ టెక్నాలజీతో ప్రపంచం రోజుకో కొత్త తరహా అద్బుతానికి…