తెలుగు చిత్ర పరిశ్రమ ఇప్పుడిప్పుడే షూటింగులంటూ గాడిన పడుతోంది. షూటింగులు చేయడం వల్ల కొందరు కరోనా బారిన పడుతున్నా కానీ ఇక ఇలాంటి చెదురు మదురు సంఘటనలు తప్పవంటూ షూటింగ్స్ చేసేస్తున్నారు. అలాగే సినిమా థియేటర్లు కూడా డిసెంబర్ మూడవ వారం నుంచీ షరా మామూలుగా నడుస్తాయనే ఆశాభావంతో వున్నారు. అయితే వివిధ దేశాలలో మొదలైన కరోనా సెకండ్ వేవ్ మన నిర్మాతలను భయపెడుతోంది.
ఇప్పటికే విదేశాల్లో షూటింగ్ ప్లాన్ చేసిన సినిమాలకు ఈ సెకండ్ వేవ్ ఆటంకంగా మారింది. అదే వేవ్ ఇండియాలో వస్తే పరిస్థితి ఎలా వుంటుందనే దానిపై పాండమిక్ నిపుణులకు కూడా ఐడియా లేదు.
ఈసారి వచ్చేది తీవ్రంగా వుండవచ్చునని కొందరు, ఆల్రెడీ మనకు క్రౌడ్ ఇమ్యూనిటీ మొదలయిపోయిందని కొందరు, మళ్లీ లాక్‍డౌన్ తప్పదని ఇంకొందరు వివిధ రకాల విశ్లేషణలతో ఊదరగొట్టేస్తున్నారు. అయితే సెకండ్ వేవ్ తీవ్రంగా వున్నట్టయితే మాత్రం ఆ తాకిడి తట్టుకునే శక్తి తెలుగు చిత్ర పరిశ్రమకు అసలు లేదు.
ఇప్పటికే నిర్మాతలు వెనకా ముందూ ఆలోచించే పరిస్థితికి వచ్చేసారు. జనవరికి అయినా సినిమా థియేటర్లు యథావిధిగా రన్ అవ్వకపోతే మాత్రం టాలీవుడ్ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతుందని తెలుగు చలనచిత్ర ప్రముఖులే కంగారు పడుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates