అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా అనౌన్స్ అయిన అట్లీ సినిమా గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు నెటిజన్లు. అట్లీ ఇప్పటిదాకా తీసిన సినిమాలను దృష్టిలో ఉంచుకుని ఇది మామూలు మాస్ సినిమానే అనుకుంటూ వచ్చారు ఇన్నాళ్లూ. కానీ ఈసారి అట్లీ అంతర్జాతీయ స్థాయిలో సైఫై థ్రిల్లర్ తీయబోతున్నాడని నిన్నటి వీడియో చూస్తే అర్థమైంది. దీని బడ్జెట్, స్పాన్ అన్నీ కూడా వేరే లెవెల్లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దేశంలోనే అతి పెద్ద నిర్మాణ సంస్థల్లో ఒకటైన సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతోంది. ఇండియన్ సినిమాల మీద వంద కోట్ల బడ్జెట్ కూడా చాలా ఎక్కువ అనుకునే రోజుల్లో ‘రోబో’ మీద ఏకంగా రూ.200 కోట్ల దాకా ఖర్చు పెట్టిన నిర్మాణ సంస్థ అది.
కంటెంట్‌ను బట్టి ఎంతైనా బడ్జెట్ పెట్టడానికి సిద్ధంగా ఉంటుంది సన్ పిక్చర్స్. ఈ నేపథ్యంలో సన్ పిక్చర్స్ బన్నీ-అట్లీ ప్రాజెక్టు మీద 700 కోట్లకు పైగానే బడ్జెట్ పెట్టబోతున్నట్లు వార్తలు వస్తుండడం విశేషం.
ఈ బడ్జెట్లో రూ.300 కోట్ల దాకా హీరో, డైరెక్టర్ పారితోషకాలకే కేటాయించబోతున్నారట. ‘పుష్ప-2’ చిత్రానికి ఏకంగా రూ.159 కోట్ల పారితోషకంతో రికార్డు సృష్టించాడు బన్నీ. ఇప్పుడు అట్లీ సినిమాకు దాన్ని మించి, ఏకంగా రూ.200 కోట్ల దాాకా రెమ్యూనరేషన్ తీసుకోనున్నాడట బన్నీ. అట్లీ వాటా రూ.100 కోట్ల పైమాటే అని సమాచారం. ఇక మిగతా పారితోషకాలకు ఎంత కాదన్నా రూ.50 కోట్ల దాకా అవుతుంది.
ఓ ఇండియన్ సినిమాలో కేవలం రెమ్యూనరేషన్లకే రూ.350 కోట్లు వెచ్చించడం అంటే అసామాన్యమైన విషయం. హాలీవుడ్ వీఎఫెక్స్ స్టూడియోలు, టెక్నీషియన్లు భాగమవతుున్న ఈ సినిమాకు ప్రొడక్షన్ ఖర్చు రూ.350-400 కోట్ల దాకా అయ్యే అవకాశముంది. ఐతే ‘పుష్ప-2’ తర్వాత బన్నీ నటిస్తున్న సినిమా కావడం, అట్లీకి కూడా సూపర్ సక్సెస్ రికార్డు ఉండడంతో బడ్జెట్ వర్కవుట్ చేయడం పెద్ద విషయమేమీ కాదు. ఈజీగా ఈ మూవీకి రూ.వెయ్యి కోట్లకు తక్కువ కాకుండా బిజినెస్ అవుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం రామాయణం చిత్రాన్ని రికార్డు స్థాయిలో రూ.800 కోట్లకు పైగా బడ్జెట్లో రూపొందిస్తున్నట్లు వార్తలు వస్తుండగా.. బన్నీ-అట్లీ మూవీ రెండో స్థానంలో నిలవనుంది.
This post was last modified on April 11, 2025 9:35 am
సినీ రంగంలో హీరోలకు భారీగా పారితోషకాలు ఇస్తారు. కానీ హీరోయిన్ల విషయంలో మాత్రం చాలా వ్యత్యాసం ఉంటుందన్నది ఓపెన్ సీక్రెట్.…
గోరంట్ల మాధవ్. 2022లో జోరుగా వినిపించిన పేరు. హిందూపురం వైసీపీ ఎంపీగా అప్పట్లో ఆయన న్యూడ్ వీడియో ఆరోపణల తో…
ఒకప్పుడు ఐటెం సాంగ్స్ అంటే అందుకోసమే కొందరు భామలుండేవారు. వాళ్లే ఆ పాటలు చేసేవారు. కానీ గత దశాబ్ద కాలంలో…
బాలీవుడ్లో విలక్షణ పాత్రలతో మంచి గుర్తింపు సంపాదించి.. దక్షిణాదిన కూడా కొన్ని సినిమాల్లో నటించింది రాధికా ఆప్టే.. ‘ధోని’, ‘కబాలి’ చిత్రాల్లో నటించిన…
మంచు ఫ్యామిలీ గొడవ గత కొన్ని రోజులుగా మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోన సంగతి తెలిసిందే. తండ్రీ కొడుకులు.. అన్నదమ్ములు…
"ఈ రోజు నుంచే.. ఈ క్షణం నుంచే నేను రాజకీయాల్లోకి వస్తున్నా.. ఏ పార్టీలో చేరేదీ త్వరలోనే ప్రకటిస్తా. జగన్…