థియేటర్లో ఆడిన ఎంత పెద్ద హిట్ సినిమాలనైనా టికెట్లు కొని చూడని ప్రేక్షకులు బోలెడు ఉంటారు. వాళ్లకు ఒకప్పుడు శాటిలైట్ ఛానల్స్ మొదటి ఆప్షన్ గా ఉండేవి కానీ ఇప్పుడా స్థానాన్ని ఓటిటిలు తీసేసుకున్నాయి. అందుకే శుక్రవారం వచ్చినప్పుడల్లా కొత్త కంటెంట్ ఏం వచ్చిందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఈ ఏప్రిల్ 11 వాళ్లకు డబుల్ ట్రిపుల్ ధమాకా కానుంది. నెట్ ఫ్లిక్స్ వేదికగా నాని నిర్మించిన ‘కోర్ట్’ అన్ని భాషల్లో ఒకేసారి స్ట్రీమింగ్ కానుంది. పెద్దగా అంచనాలు లేకుండా రిలీజై సర్ప్రైజ్ సూపర్ హిట్ అనిపించుకున్న ఈ కోర్ట్ రూమ్ డ్రామా డిజిటల్ లోనూ అంతే సంచలనం సృష్టిస్తుందనే నమ్మకం నాని టీమ్ లో ఉంది.
పుష్ప 2 తర్వాత అంత పెద్ద సక్సెస్ సాధించిన ప్యాన్ ఇండియా మూవీగా నిలిచిన ‘ఛావా’ ఇదే నెట్ ఫ్లిక్స్ లో రానుంది. విక్కీ కౌశల్, రష్మిక మందన్న నటించిన ఈ శంభాజీ మహారాజ్ బయోపిక్ కి ఉత్తరాది జనాలు బ్రహ్మరథం పట్టారు. మిస్ చేసుకున్న వాళ్ళు నిక్షేపంగా బుల్లితెరపై చూసుకుంటారు. ఇదే ప్లాట్ ఫార్మ్ లో వైభవ్ నటించిన కామెడీ చిత్రం ‘పేరసు’ని తెలుగు ఆడియోతో పాటు స్ట్రీమింగ్ చేయబోతున్నాడు. కోలీవుడ్ లో దీనికి మంచి హిట్టు దక్కింది. రెండు రోజుల గ్యాప్ తో జివి ప్రకాష్ నటించిన ‘కింగ్స్టన్’ని జీ5 వేదికగా తీసుకొస్తున్నారు. ఇదొకటి ఉందనే సంగతే చాలా మందికి తెలియదు కాబట్టి వ్యూస్ రావొచ్చు.
ఆది సాయికుమార్ నటించిన ఫాంటసీ థ్రిల్లర్ ‘షణ్ముఖ’ ఆహాలో వస్తోంది. సంచలనం సృష్టించిన మొదటి భాగానికి కొనసాగింపుగా అమెజాన్ ప్రైమ్ లో ‘చోరీ 2’ తెస్తున్నారు. థియేట్రికల్ గా విజయవంతమైన సినిమాకు ఓటిటి కొనసాగింపు రావడం విచిత్రం. మొత్తానికి ఒళ్ళు కాళ్ళు కదపకుండా ఇంట్లోనే కాలక్షేపానికి లోటు లేకుండా ఇన్నేసి సినిమాలు వస్తున్నాయి. ఆల్రెడీ ‘టుక్ టుక్’ లాంటివి అందుబాటులోకి వచ్చేశాయి కూడా. థియేటర్ కు ఓటిటికి మధ్య గ్యాప్ తగ్గిపోవడం పట్ల బయ్యర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో ఇవన్నీ 28 నుంచి 50 రోజుల మధ్యలో నిడివి పెట్టుకున్నవి కావడం గమనార్షం.
This post was last modified on April 10, 2025 10:10 pm
వైసీపీలో చీలిక ఏర్పడుతోందా? ప్రజల మనోభావాలను విస్మరిస్తున్న వైసీపీ అధినేతపై ఆ పార్టీ నాయకులు గుస్సాగా ఉన్నారా? అంటే ఔననే…
ప్రపంచవ్యాప్తంగా విజయ్ అభిమానులను తీవ్ర మనస్థాపానికి గురి చేసిన జన నాయకుడు సెన్సార్ వివాదం ఒక కొలిక్కి వచ్చేసింది. యు/ఏ…
వెండితెరకు చాలా గ్యాప్ తీసుకున్న సమంత త్వరలో మా ఇంటి బంగారంతో కంబ్యాక్ అవుతోంది. జీవిత భాగస్వామి రాజ్ నిడిమోరు…
ప్రభాస్ అభిమానుల ఎదురు చూపులకు బ్రేక్ వేస్తూ రాజా సాబ్ థియేటర్లలో అడుగు పెట్టేశాడు. టాక్స్, రివ్యూస్ సంగతి కాసేపు…
ఏ రాష్ట్రంలో అయినా... ప్రతిపక్ష నాయకులకు ప్రభుత్వాలు పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వవు. సహజంగా రాజకీయ వైరాన్ని కొనసాగిస్తాయి. ఏపీ సహా…
ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపాయి. పార్టీలకు…