యాంకర్ గా ఒకవైపు కెరీర్ నడిపించుకుంటూనే అప్పుడప్పుడు సోలో హీరోగా సినిమాలు చేసుకుంటున్న సుడిగాలి సుధీర్ తాజాగా ఒక వివాదంలో చిక్కుకున్నాడు. ఇటీవలే జరిగిన రియాలిటీ షోలో ఒక స్కిట్ చేశాడు. సీనియర్ హీరోయిన్ రంభ అతిథిగా వచ్చిన ఎపిసోడ్ అది. ఆమె ఎంట్రీ స్పెషల్ గా ఉండాలనే ఉద్దేశంతో 1998లో వచ్చిన బావగారు బాగున్నారా ఇంటర్వెల్ సీన్ ని రీ క్రియేట్ చేశారు. నంది కొమ్ముల మధ్యలో నుంచి సుధీర్ చూస్తుండగా రంభ దర్శనం ఇవ్వడం ఈ సన్నివేశం. ఒక్క మాట మార్చకుండా యాజిటీజ్ గా దింపేశారు. ఇక్కడే ఊహించని విధంగా కాంట్రావర్సి మొదలయ్యింది.
హిందువుల మనోభావాలు దెబ్బ తీశారంటూ సుధీర్ మీద భగ్గుమంటూ పలు సంఘాలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి చిరంజీవి చేసినప్పుడు రాని అబ్జెక్షన్ ఇప్పుడు ఎందుకు వచ్చిదంటే ఆ టైంలో ఇంటర్ నెట్, సోషల్ మీడియా గట్రాలు లేవు కనక. పైగా మెగాస్టార్ చేస్తే ఎబ్బెట్టుగా అనిపించలేదు కానీ కామెడీ స్కిట్లు చేసే సుధీర్ చేసేసరికి నెగటివ్ ఫీలింగ్ వచ్చేసింది. రంభకు స్వాగతం ఇవ్వడం కోసమే అలా రాసుకున్నప్పటికీ ఇలా వ్యవహారం కొత్త మలుపు తిరుగుతుందని ఎవరూ ఊహించి ఉండరు. ఈ సీన్ ని ఒరిజినల్ గా రాసింది పరుచూరి బ్రదర్స్ కాగా జయంత్ సి పరాంజీ దర్శకత్వం వహించారు.
ఇక్కడ మరో విషయం గమనించాలి. బావగారు బాగున్నారా కథ ప్రకారం విశ్రాంతికి చిరంజీవి రంభ కలుసుకునే ఎపిసోడ్ శివుడి గుళ్లో జరుగుతుంది. సందర్భానికి తగ్గట్టు ఒకరినొకరు చూసి షాక్ అయ్యే క్రమంలో నంది విగ్రహాన్ని వాడుకున్నారు. సింక్ కుదిరిపోయింది కాబట్టి తప్పనిపించలేదు. లేదంటే అల్లుడా మజాకా తరహాలో నిరసనలు వ్యక్తమయ్యేవి. కానీ సుడిగాలి సుధీర్ చేసింది ఖచ్చితంగా అవసరమైనది కాకపోవడంతో కామెంట్స్ వస్తున్నాయి. ఏదేమైనా ఇకపై పాత సినిమాలును వాడుకునే విషయంలో దర్శక రచయతలు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఇలాంటి సున్నిత పరిస్థితులను ఎదురుకోవాల్సి ఉంటుంది.
This post was last modified on April 9, 2025 6:42 pm
మెగాస్టార్ ఫాంటసీ మూవీ విశ్వంభర నుంచి ప్రమోషన్ పరంగా ఇప్పటిదాకా రెండు కంటెంట్స్ వచ్చాయి. మొదటిది టీజర్. దీనికొచ్సిన నెగటివిటీ…
మాములుగా సీనియర్ దర్శకులకు వరసగా డిజాస్టర్లు పడితే కంబ్యాక్ కావడం అంత సులభంగా ఉండదు. అసలు వాళ్ళ కథలు వినడానికే…
ఇంజెక్షన్ అని వినగానే చిన్న పిల్లలే కాదు, పెద్దవాళ్లలో కూడా భయం కనిపిస్తుంది. దీనికి వైద్య పరంగా ట్రిపనోఫోబియా అని…
ఏపీలో కీలకమైన ఓ రాజ్యసభ సీటు ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా షెడ్యూల్ ప్రకటించింది. వైసీపీ నుంచి…
డీజే దువ్వాడ జగన్నాథంతో ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నా హీరోయిన్ గా తన స్థాయిని అమాంతం పెంచేసిన సినిమాల్లో అల వైకుంఠపురములో…
చాట్ GPT - డీప్ సీక్ - మెటా.. ఇలా ఏఐ టెక్నాలజీతో ప్రపంచం రోజుకో కొత్త తరహా అద్బుతానికి…