Movie News

ఫ్యాన్స్ మనోభావాలతో అప్డేట్స్ ఆట

స్టార్ హీరోలకు కోట్లలో అభిమానులు ఉంటారు. నిర్మాణంలో ఉన్న క్రేజీ సినిమాలకు సంబంధించిన అప్డేట్ అంటే చాలు వాళ్లకు  ప్రాణం లేచొస్తుంది. ముఖ్యంగా టీజర్, ట్రైలర్, ఫస్ట్ లుక్, లిరికల్ సాంగ్స్, రిలీజ్ డేట్ విషయంలో ఆ ఉద్వేగాన్ని మాటల్లో కొలవడం కష్టం. ఒక్కోసారి ఇది నిర్మాతల పాలిట ఒత్తిడిగా మారిపోయి పబ్లిక్ స్టేజి మీద దీని గురించి మాట్లాడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా దిల్ రాజు, నాగవంశీ, యువి క్రియేషన్స్ లాంటి సంస్థలు, ప్రొడ్యూసర్లు వీటి వల్ల బాగా ప్రభావితం చెందారు. అప్డేట్ వస్తోందంటే ఆ సమయానికి పనులు మానుకుని ఆన్ లైన్లో ఎదురు చూసే ఫ్యాన్స్ కోట్లలో ఉంటారు.

ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే నిన్న ఎన్టీఆర్ నీల్ తాలూకు అప్డేట్ ఒకటి ఇవాళ మధ్యాన్నం ఇస్తామని నిర్మాణ సంస్థలు సోషల్ మీడియాలో పేర్కొన్నాయి. దీంతో ఏదో పెద్ద విశేషం ఉంటుందని మూవీ లవర్స్ తో పాటు ఫ్యాన్స్ ఎదురు చూశారు. తీరా చూస్తే జూనియర్ ఎన్టీఆర్ ఏప్రిల్ 22 నుంచి సెట్లో అడుగు పెట్టబోతున్నాడని చల్లని కబురు చెప్పారు. నిజానికి హీరో షూటింగ్ లో పాల్గొనడం విశేషం కాదు. ఇది అందరూ చేసేదే. అదేదో ప్రత్యేకంగా ఊరించి ఊరించి సమయం సందర్భం పెట్టుకుని పంచుకునేది అస్సలు కాదు. డైరెక్ట్ గా ఫలానా రోజు వస్తున్నాడని చెప్పినా సరిపోతుంది. ఇంత హంగామా అవసరం లేదు.

ఇదొక్కటే కాదు గతంలో ఫలానా టైంకి ఫలానా డేట్ లో అప్డేట్స్ ఇస్తామని వాయిదాలు వేసి ఫ్యాన్స్ మనోభావాలతో ఆడుకున్న దాఖలాలు చాలానే ఉన్నాయి. ఎన్టీఆర్ నీల్ బృందం చేసింది అంత సీరియస్ గా కాకపోయినా ఒక ప్యాన్ ఇండియా మూవీ మీద విపరీతమైన ఎగ్జైట్ మెంట్ నెలకొన్నప్పుడు ఎక్స్, ఇన్స్ టాలో షేర్ చేసేది స్పెషల్ అయ్యుండాలి. అంతే తప్ప హీరో వచ్చాడు, షెడ్యూల్ అయిపోయిందని చెప్పడం కాదు. వీటి సంగతలా ఉంచితే ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 9 విడుదలవుతుందనే ప్రచారం పట్ల టీమ్ స్పందించడం లేదు. నిర్ణయం తీసుకున్నారు కానీ ఇప్పట్లో చెప్పకపోవచ్చని టాక్.

This post was last modified on April 9, 2025 3:25 pm

Share

Recent Posts

మెగాస్టార్ లిస్టులో వద్దనుకున్న పేరుందా

కాకా జనవరిలో సంక్రాంతి పండక్కు వచ్చేస్తుంది. తక్కువ గ్యాప్ లో విశ్వంభర దిగుతుంది. తర్వాత ఎవరితో సినిమా ఉంటుందనేది చిరంజీవి…

12 minutes ago

నటనలో కేర్‌టేకర్‌… జనం మెచ్చిన నానా పటేకర్

బాలీవుడ్ సుప్రసిద్ధ నటుడు నానా పటేకర్ కన్ను మూయడం ఇండస్ట్రీ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. 75 వయసులో చివరి…

3 hours ago

ఇన్నేళ్ళ తర్వాత శ్రీమంతుడు రీమేకా?

కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో తెరకెక్కినన్ని రీమేక్‌లు మరే భాషలోనూ వచ్చి ఉండవు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు, తమిళంలో హిట్టయిన…

5 hours ago

లెజెండరీ నటుడు నానా పటేకర్ కన్నుమూత!

ప్రముఖ నటుడు నానా పటేకర్ గురువారం కన్నుమూశారు. గోవాలోని తన నివాసంలో తీవ్ర గుండెపోటుకు గురైన ఆయనను వెంటనే సమీపంలోని…

6 hours ago

‘రణబాలి’ నేర్చుకున్న ‘ప్యారడైజ్’ పాఠం

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ సినిమాకు రిలీజ్ ముందు రోజు రాత్రి…

6 hours ago

ఖైదీకి గోల్డ్ మెడల్.. జైల్లోనే చదివి డిగ్రీలో టాప్‌!

కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి విద్యపై ఆసక్తి, పట్టుదల తోడైంది. దీంతో చదువులో అత్యుత్తమ ఫలితాలను సాధించి ఇతర ఖైదీలకు…

7 hours ago