ఈ రోజు అల్లు అర్జున్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అట్లీ దర్శకత్వంలో అతను చేయబోయే మెగా మూవీకి సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్‌తో వీడియో వచ్చింది. ఈ వీడియోతో సినిమా మీద అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఐతే ‘పుష్ప-2’ తర్వాత బన్నీ చేయాలనుకున్న సినిమా ఇది కాదు. దీని కంటే ముందు త్రివిక్రమ్ ప్రాజెక్టును ఓకే చేశాడు. దాన్నే ముందు మొదలుపెట్టాలనుకున్నాడు. కానీ అనూహ్యంగా అట్లీ ప్రాజెక్టు తెరపైకి వచ్చింది. ఆ సినిమాకు సంబంధించి అన్నీ వేగంగా ముందుకు కదిలాయి. అతి త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదికి కూడా వెళ్లబోతోంది.
అట్లీతో బన్నీ సినిమా అన్నపుడు పెద్దగా ఎగ్జైట్ కాని వాళ్లలో కూడా ఈ రోజు రిలీజ్ చేసిన ప్రోమో వీడియో క్యూరియాసిటీ పెంచింది. ఈ ప్రాజెక్టుకు కావాల్సినంత హైప్ వచ్చేసింది. ఐతే ఎప్పట్నుంచో అభిమానులు ఎంతో ఊహించుకుంటున్న త్రివిక్రమ్ ప్రాజెక్టు సంగతి ఇప్పుడు డోలాయమానంలో పడిపోవడమే ఆశ్చర్యం కలిగించే విషయం. బన్నీ.. అట్లీ మూవీతో పాటు త్రివిక్రమ్ సినిమా కూడా చేస్తాడనే కొంత కాలంగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఐతే ఇప్పటిదాకా ఆ సినిమాను అధికారికంగా అనౌన్స్ చేసింది లేదు. బన్నీ వాసు, నాగవంశీ లాంటి వాళ్లు వేర్వేరు సందర్భాల్లో సినిమాకు బాగానే హైప్ ఇచ్చారు కానీ.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ మాత్రం ఎంతకీ రావట్లేదు.
అట్లీ సినిమా నుంచి రిలీజ్ చేసినట్లు వీడియో ప్రోమో లేకపోయినా.. కనీసం బన్నీ పుట్టిన రోజుకు ఒక మంచి అప్డేట్ అయినా రిలీజ్ చేస్తే బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఇప్పటికే నిర్మాత నాగవంశి సినిమా మొదలవ్వడానికి కొంచం సమయం పడుతుంది అని పలు సందర్భాల్లో చెప్పడం అందరికీ తెలిసిన విషయమే. అందుకే ఒక సాధారణ పోస్టర్ తో సరిపెట్టారు. ఇక ఫ్యాన్స్ ఎలాంటి అప్డేట్స్ ఆశించకుండా… అట్లీ బన్నీ అనౌన్స్మెంట్ వీడియో తో సరిపెట్టుకోవాలని కామెంట్లు మొదలయ్యాయి.
This post was last modified on April 8, 2025 8:02 pm
బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి స్టార్ హీరోగా ఎదగడం అంత తేలికైన విషయం కాదు. ఎంతో ప్రతిభ ఉండాలి.…
ఒక టైంలో నిలకడగా హిట్లు కొడుతూ మంచి ఊపులో కనిపించాడు యువ కథానాయకుడు విశ్వక్సేన్. కానీ కొన్నేళ్లుగా అతడికి విజయాలు…
రాజధాని అమరావతి పనుల పునః ప్రారంభ ఘట్టానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ నోటి నుంచి అనూహ్యంగా తెలుగు వారి…
నోట్ల రద్దు తర్వాత సడన్ గా వచ్చిన రూ.2000 నోట్లను తిరిగి వెనక్కి తీసుకునే ప్రక్రియను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్…
జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల దేశంలో ఉన్న పాకిస్థాన్ పౌరులకు గడువు…
నిన్న సూర్య రెట్రోతో పాటు తమిళంలో టూరిస్ట్ ఫ్యామిలీ విడుదలయ్యింది. తెలుగు డబ్బింగ్ చేయలేదు కానీ కోలీవుడ్ లో దీని…