పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ చేయబోయే ప్యాన్ ఇండియా మూవీ అట్లీ చేతికొచ్చిందనే వార్త నెలల క్రితమే లీకైనప్పటికీ అది ఏ జానరనే అనుమానం అలాగే ఉండిపోయింది. దానికి ఇవాళ బన్నీ పుట్టినరోజు సందర్భంగా చెక్ పెట్టేశారు. రెండున్నర నిమిషాల ప్రత్యేక వీడియో చేయించి కాన్సెప్ట్ ఎలా ఉండబోతోందో చూచాయగా చెప్పేశారు. నిర్మాత కళానిధి మారన్ ను అల్లు అర్జున్, అట్లీ ఇద్దరు కలిశాక పరస్పరం కరచాలనం చేసుకుని, ఆ తర్వాత అమెరికా వెళ్ళిపోయి పలు విఎఫెక్స్ స్టూడియోలకు వెళ్లి, అక్కడి నిపుణులకు కథ వినిపించి, ఎలాంటి ఎఫెక్ట్స్ కావాలో వివరించి వాళ్ళ అభిప్రాయాలు తీసుకునే షాట్స్ అన్నీ పొందుపరిచారు.
అల్లు అర్జున్ మీద ట్రయిల్ విఎఫెక్స్ తాలూకు ఫుటేజ్, ఎక్స్ ప్రెషన్లకు సంబంధించిన కొన్ని షాట్స్ ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి. మొత్తానికి సైన్స్ ఫిక్షన్ తో పాటు చిత్ర విచిత్ర రాకాసి జీవాలు, జంతువులు ఇందులో భాగం కానున్నాయనే క్లూ అయితే వచ్చింది. క్యాస్టింగ్, సాంకేతిక నిపుణులు తదితర వివరాలు పొందుపరచలేదు కానీ స్క్రిప్ట్ ఎంత ఎగ్జైటింగ్ అనిపించిందో ఫారిన్ టెక్నీషియన్లతో చెప్పించడం బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చింది సాయి అభ్యంకర్ అయినా అతని పేరుని ఎక్కడా ప్రస్తావించలేదు. ఏదైనా స్పెషల్ అప్డేట్ లో రివీల్ చేస్తారేమో చూడాలి. కంటెంట్ అయితే ఆకట్టుకునేలా ఉంది.
త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళబోతున్న ఏఏ 22 దర్శకుడు అట్లీకి ఆరో సినిమా. బడ్జెట్ పరంగా ఇదే అతి పెద్దది. చెన్నై టాక్ ప్రకారం బన్నీకి రెండు వందల కోట్లు, అట్లీకి వంద కోట్లు రెమ్యునరేషన్ రూపంలోనే సగం ఖర్చవుతోందట. ఇంతకు ముందు సల్మాన్ ఖాన్ తో సినిమా చేయాలని ప్రయత్నించిన అట్లీ అంత బడ్జెట్ తట్టుకునే మార్కెట్ కండల వీరుడుకి లేకపోవడంతో యునానిమస్ ప్యాన్ ఇండియా ఇమేజ్ ఉన్న బన్నీకి షిఫ్ట్ అయిపోయాడు. 2026లో విడుదలయ్యే అవకాశమున్న ఈ విజువల్ వండర్ లో అంతర్జాతీయ నిపుణులతో పాటు వివిధ బాషల నుంచి క్రేజీ నటీనటులు భాగం కాబోతున్నారు.
This post was last modified on April 8, 2025 11:19 am
విశ్వక్ సేన్ కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్ లైలా. ఆడవేషం వేసి నరేష్ పాత సినిమా చిత్రం భళారే విచిత్రంలాగా…
#AskKavitha- హ్యాష్ ట్యాగ్‌తో నెటిజన్ల నుంచి అభిప్రాయాలు సేకరించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత.. ఇదే సమయంలో పలువురు నెటిజన్లు…
భారతదేశం గర్వించదగ్గ గొప్ప సంగీత విద్వాంసుల్లో ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి స్థానం ఎవరూ భర్తీ చేయనిది, అందుకోలేనిది. దక్షిణాదిలోనే కాదు…
మాటిచ్చిన కేవలం పదిరోజుల్లోనే ఆ హామీని కార్యరూపంలోకి తీసుకువచ్చారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. తొమ్మిది రోజుల క్రితం చిలకలూరిపేట…
నటుడిగా చాలా గ్యాప్ తీసుకున్న మంచు మనోజ్ ఈ ఏడాది రెండు సినిమాల్లో విలన్ గా నటించి కంబ్యాక్ అయ్యాడు.…
హర్యానాలో పనిచేస్తున్న తెలుగు ఐపీఎస్ అధికారి వై. పూరన్ కుమార్ ఆత్మహత్య ఘటనలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ…