ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న గుడ్ బ్యాడ్ అగ్లీ తెలుగు ట్రైలర్ ఇప్పటిదాకా రాలేదు. అసలు డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ ఏప్రిల్ 10 ఉంటుందో లేదోననే అనుమానాలు మొదలైపోయాయి. కంటెంట్ పరంగా గ్యాంబ్లర్ స్థాయిలో ఈ ప్యాన్ ఇండియా మూవీ మీద మంచి అంచనాలున్నాయి. అజిత్ చాలా గ్యాప్ తర్వాతమాస్ మేకోవర్స్ లో కనిపించాడు. వయసు పరంగా రెండు మూడు గెటప్స్ వేసి అన్ని వర్గాల ఆడియన్స్ ని టార్గెట్ చేసుకున్నాడు. సరిగా మార్కెటింగ్ చేసుకుంటే ఇతర భాషల్లోనూ మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు బోలెడున్నాయి. కానీ మైత్రి ఆ దిశగా అడుగులు వేయకపోవడం డిస్ట్రిబ్యూషన్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.
ఎందుకంటే ఈ వారం సిద్ధూ జొన్నలగడ్డ జాక్ తప్ప వేరే పోటీ లేదు. ఏపీ తెలంగాణలో ఉన్న థియేటర్లన్నీ దాన్నే వేసుకోవుగా. ఆల్రెడీ మ్యాడ్ స్క్వేర్ నెమ్మదించింది. కోర్ట్ ఓటిటి ప్రీమియర్ డేట్ వచ్చేసింది. రాబిన్ హుడ్, వీరధీరశూర, ఎంపురాన్ లు ఫైనల్ రన్ కోసం ఎదురు చూస్తున్నాయి. సో జాక్ తో పాటు ఇంకో కొత్త రిలీజ్ కు బోలెడు స్కోప్ ఉంది. దాన్ని గుడ్ బ్యాడ్ అగ్లీ వాడుకోవాలి. ఇప్పటిదాకా తెలుగు వెర్షన్ కు సంబంధించి ఎలాంటి అప్డేట్ లేకపోవడం మూవీ లవర్స్ ని ఆశ్చర్యపరుస్తోంది. ఒకవేళ ఆఘమేఘాల మీద నిర్ణయం తీసుకుని సమాంతరంగా రిలీజ్ చేసినా బజ్ వల్ల ఊపు రావడం కష్టమే.
కొంచెం ముందస్తుగానే ప్లాన్ చేసుకుని ఉంటే ఈపాటికి గుడ్ బ్యాడ్ అగ్లీ మన దగ్గరా ఆసక్తి రేగేది. గతంలో తెగింపు, వలిమై లాంటి వాటికి హీరో అజిత్ హైదరాబాద్ రాకపోయినా ఏదోలా మేనేజ్ చేసి ప్రమోషన్లు నడిపించి జనాన్ని థియేటర్లకు వచ్చేలా చేశారు. భారీ వసూళ్లు దక్కలేదు కానీ అజిత్ మార్కెట్ దృష్ట్యా డీసెంట్ కలెక్షన్లు అయితే వచ్చాయి. ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన గుడ్ బ్యాడ్ అగ్లీలో సునీల్, అర్జున్ దాస్ లాంటి తెలిసిన క్యాస్టింగ్ బాగానే ఉంది. కంటెంట్ పరంగా గుడ్ అనిపిస్తున్న ఈ సినిమాకు పాటిస్తున్న స్ట్రాటజీ మాత్రం బ్యాడ్ అంటున్నారు ఫ్యాన్స్. చూడాలి మరి ఏప్రిల్ 10 ఏం జరగనుందో.
This post was last modified on April 7, 2025 12:54 pm
ఒకప్పుడు ఐటెం సాంగ్స్ అంటే అందుకోసమే కొందరు భామలుండేవారు. వాళ్లే ఆ పాటలు చేసేవారు. కానీ గత దశాబ్ద కాలంలో…
బాలీవుడ్లో విలక్షణ పాత్రలతో మంచి గుర్తింపు సంపాదించి.. దక్షిణాదిన కూడా కొన్ని సినిమాల్లో నటించింది రాధికా ఆప్టే.. ‘ధోని’, ‘కబాలి’ చిత్రాల్లో నటించిన…
మంచు ఫ్యామిలీ గొడవ గత కొన్ని రోజులుగా మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోన సంగతి తెలిసిందే. తండ్రీ కొడుకులు.. అన్నదమ్ములు…
"ఈ రోజు నుంచే.. ఈ క్షణం నుంచే నేను రాజకీయాల్లోకి వస్తున్నా.. ఏ పార్టీలో చేరేదీ త్వరలోనే ప్రకటిస్తా. జగన్…
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సతీమణి, ఇటాలియన్ అన్నాలెజెనోవో తిరుమల…
నారా రోహిత్ కొత్త సినిమా సుందర కాండ టీజర్ వచ్చి తొమ్మిది నెలలు దాటేసింది. అప్పుడెప్పుడో సెప్టెంబర్ రిలీజ్ అనుకున్నారు…