కలెక్షన్ల కోసం పోటీ పడే స్టార్ హీరోల అభిమానులను చూశాం కానీ ఇప్పుడీ ట్రెండ్ కటవుట్లకూ పాకింది. తమదే రికార్డుగా మిగిలిపోవాలనే తాపత్రయం వేరే రాష్ట్రాలకు అంటుకుంది. ఇటీవలే గేమ్ ఛేంజర్ విడుదల సమయంలో 256 అడుగుల కటవుట్ ని విజయవాడలో ఏర్పాటు చేయడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇండియాలోనే అత్యంత పొడవైనదిగా కొత్త మైలురాయి నమోదు చేసుకుంది. అంతకు ముందు సలార్ (236), కెజిఎఫ్ 2 (216), ఎన్జికె (215), విశ్వాసం (185) తో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. సరే లేనిది మాకేనా అని అజిత్ ఫ్యాన్స్ అనుకున్నారేమో వెంటనే గుడ్ బ్యాడ్ అగ్లీ కోసం రెడీ అయిపోయారు.
ఏకంగా 285 అడుగుల కటవుట్ ని రెడీ చేసి తమిళనాడు తెంకాశిలోని ఒక థియేటర్ కు ప్రతిష్టించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. మెటల్ ఫెన్సింగ్ తో గ్రిల్స్ ఏర్పాటు చేసి ఒక్కో భాగాన్ని పెడుతూ వెళ్లారు. అజిత్ తల సెట్ అయిన కాసేపటి తర్వాత క్రమంగా అది కూలిపోయే దిశగా ఉండటం గమనించిన జనం వెంటనే అప్రమత్తం కావడంతో అక్కడి నుంచి తప్పుకున్నారు. చూస్తుండగానే మొత్తం హాలు బయటి ప్రాంగణంలో కూలిపోయింది. అదృష్టవశాత్తు ఎవరికి గాయాలు కావడం కానీ, ప్రాణాలు పోవడం కాని జరగలేదు. ఆ సమయంలో పైన ఎవరూ లేకపోవడం పెద్ద గండాన్ని తప్పించింది.
ఇదే తరహాలో 2019 విశ్వాసం టైంలో పాలాభిషేకం చేయబోతూ అయిదుగురు ఫ్యాన్స్ కిందపడి తీవ్రంగా గాయపడటం పట్ల అజిత్ అప్పట్లో ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనను అసోసియేషన్లు లేవని, తల లాంటి బిరుదులు పెట్టొద్దని ఎంత చెప్పినా సరే అభిమానులు మాత్రం వాటిని మానడం లేదు. అయినా చెక్క లాంటి పదార్థాలతో తయారయ్యే కటవుట్లకు అంతేసి ఎత్తుని పెంచుకుంటూ పోవడం క్షేమం కాదు. చుట్టుపక్కల వాళ్లకు రిస్క్. ఏ మాత్రం గాలి హోరుగా వీచినా ప్రమాదం పొంచి ఉంటుంది. అజిత్ దీని గురించి ఇంకా స్పందించలేదు. వీడియో చూస్తే మాత్రం ఈసారి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వడం ఖాయమని చెన్నై టాక్.
This post was last modified on April 6, 2025 11:10 pm
అభిమానులు భయపడినట్టే జరిగేలా ఉంది. మే 9 హరిహర వీరమల్లు వస్తుందని గంపెడాశలతో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి షాక్…
థియేటర్లలో జనాలు లేక అలో లక్ష్మణా అంటూ అల్లాడిపోతున్న బయ్యర్లకు ఊరట కలిగించేందుకు ఈ వారం రెండు చెప్పుకోదగ్గ సినిమాలు…
మెగాస్టార్ ఫాంటసీ మూవీ విశ్వంభర నుంచి ప్రమోషన్ పరంగా ఇప్పటిదాకా రెండు కంటెంట్స్ వచ్చాయి. మొదటిది టీజర్. దీనికొచ్సిన నెగటివిటీ…
మాములుగా సీనియర్ దర్శకులకు వరసగా డిజాస్టర్లు పడితే కంబ్యాక్ కావడం అంత సులభంగా ఉండదు. అసలు వాళ్ళ కథలు వినడానికే…
ఇంజెక్షన్ అని వినగానే చిన్న పిల్లలే కాదు, పెద్దవాళ్లలో కూడా భయం కనిపిస్తుంది. దీనికి వైద్య పరంగా ట్రిపనోఫోబియా అని…
ఏపీలో కీలకమైన ఓ రాజ్యసభ సీటు ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా షెడ్యూల్ ప్రకటించింది. వైసీపీ నుంచి…