Movie News

భైరవం మంచి ఛాన్సులు వదిలేసుకుంది

అల్లుడు అదుర్స్ తర్వాత హిందీ ఛత్రపతి కోసం మూడేళ్లు టాలీవుడ్ కు దూరమైపోయిన బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ఇప్పుడు ప్రభాస్ రేంజ్ లో వేగంగా సినిమాలు చేస్తున్నాడు. సింగల్ టైం మల్టీపుల్ మూవీస్ సూత్రాన్ని పాటిస్తూ స్పీడ్ పెంచాడు. వీటిలో ముందు వరసలో ఉన్నది భైరవం. తమిళ సూపర్ హిట్ గరుడన్ రీమేక్ గా రూపొందిన ఈ విలేజ్ డ్రామాకు సంబంధించిన టీజర్, లిరికల్ వీడియోస్ వచ్చి వారాలు, నెలలు గడిచిపోయాయి. వాస్తవానికి సంక్రాంతికి అనుకున్నారు. కానీ పోటీ వల్ల తప్పుకున్నారు. తీరా చూస్తే ఇప్పుడు ఫిబ్రవరి, మార్చి అయిపోయి ఏప్రిల్ కూడా వచ్చేసింది. కానీ భైరవం అప్డేట్ లేదు.

ఇంకొంత భాగం మాత్రమే పెండింగ్ ఉందని, టైసన్ నాయుడు కోసం సాయిశ్రీనివాస్ చిన్న బ్రేక్ తీసుకోవడం వల్ల భైరవం వెయిట్ చేయాల్సి వస్తోందని ఇన్ సైడ్ టాక్. నారా రోహిత్, మంచు మనోజ్ లు ఇతర ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ద్వారా దర్శకుడు శంకర్ కూతురు అదితి శంకర్ తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమవుతోంది. ఓ వెన్నెల సాంగ్ లాంచ్ ఈవెంట్ లో హుషారుగా ఆడిపాడి జనాల దృష్టిలో పడింది. కన్నప్పతో పాటుగా ఏప్రిల్ 25 రావొచ్చనే లీక్ గతంలో వచ్చింది. కానీ మంచు విష్ణు పోస్ట్ ప్రొడక్షన్ వల్ల వాయిదా వేసుకున్నాడు. అలాంటప్పుడు భైరవం ఈ ఛాన్స్ వాడుకుని ఉండాల్సింది.

అనుష్క ఘాటీ తప్పుకోవడం లాంటి అడ్వాంటేజ్ ని సైతం భైరవం ఉపయోగించుకోలేదు. ఇప్పుడు మేకి వెళ్ళిపోవాలి. 9న హరిహర వీరమల్లు ఉంది. చూస్తుంటే ఇది రావడం అనుమానంగానే ఉందని ట్రేడ్ రిపోర్ట్. అదే కనక జరిగితే ఆ స్లాట్ ని తీసుకునేందుకు భైరవం సిద్ధంగా ఉందని సమాచారం. పబ్లిసిటీ ఆపేసి రోజులు గడుస్తున్నాయి. బాక్సాఫీస్ దగ్గర సరైన మాస్ సినిమా లేని గ్యాప్ ని చేతులారా వదులుకున్నట్టు అయ్యింది. బలమైన కంబ్యాక్ గా ఈ సినిమా నిలుస్తుందని సాయిశ్రీనివాస్ చాలా నమ్మకంగా ఉన్నాడు. నాంది ఫేమ్ విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన భైరవంకు శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు.

This post was last modified on April 6, 2025 6:00 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Bhairavam

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

2 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

6 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

7 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

8 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

9 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

9 hours ago