భారీ అంచనాలున్న ఒక కొత్త సినిమాకు సంబంధించి టీజర్, ట్రైలర్ ఏవైనా రిలీజైతే వ్యూస్, లైక్స్ మోత మోగిపోతుంది. ఐతే ఆ వేడి తొలి వారంలోనే ఉంటుంది. ఆ తర్వాత జనాలు లైట్ తీసుకుంటారు. ఓ మోస్తరుగానే వ్యూస్ పెరుగుతుంటాయి. ఉన్నట్లుండి వ్యూస్, లైక్స్ పెరిగిపోవడం ఉండదు. కానీ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నుంచి ఏడు నెలల కిందట విడుదలైన సీతారామరాజు పాత్ర టీజర్ విషయంలో మాత్రం దీనికి భిన్నంగా జరుగుతోంది.
గత కొన్ని రోజుల్లో ఈ టీజర్‌కు అనూహ్యంగా వ్యూస్, లైక్స్ పెరిగిపోయాయి. రిలీజైనపుడు రికార్డులేమీ బద్దలు కొట్టని ఈ టీజర్.. ఇప్పుడు కొత్తగా రికార్డు నెలకొల్పింది. అత్యధిక వ్యూస్ తెచ్చుకున్న తెలుగు టీజర్‌గా రికార్డులకెక్కింది. దాని టీజర్ వ్యూస్ 33.3 మిలియన్లు (3.33 కోట్లు) దాటిపోయింది. ఈ క్రమంలో ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ రికార్డును బద్దలు కొట్టింది. దాని వ్యూస్ ప్రస్తుతం 3.2 మిలియన్లున్నాయి.
‘ఆర్ఆర్ఆర్’ పాన్ ఇండియా సినిమా. ‘సరిలేరు..’ లోకల్ మూవీ. అయినా సరే.. ఆ టీజర్ రికార్డును మార్చిలో రిలీజైన రామరాజు టీజర్ బద్దలు కొట్టలేకపోయింది. అప్పట్లో ఈ టీజర్ పెద్దగా అంచనాల్లేకుండా విడుదలైంది. రిలీజ్ ముంగిట హైప్ లేదు. అందువల్లే వ్యూస్ ఆశించిన స్థాయిలో లేవు. ఐతే ఇటీవలే ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ఎన్టీఆర్ పోషించిన కొమరం భీమ్ పాత్రకు సంబంధించిన టీజర్ రిలీజైంది. దీని కోసం కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. హైప్ బాగా వచ్చింది. దీంతో దీనికి భారీగా వ్యూస్ వచ్చాయి.
ఐతే ఈ టీజర్‌కు ఎక్కువ వ్యూస్, లైక్స్ వస్తే చరణ్ మీద తారక్ పైచేయి సాధించినట్లు అవుతుందన్న ఉద్దేశంతో మెగా అభిమానులు దండయాత్ర మొదలుపెట్టారు. మళ్లీ రామరాజు టీజర్ మీద దృష్టిపెట్టారు. దీంతో వ్యూస్, లైక్స్ ఒక్కసారిగా పెరిగాయి. భీమ్ టీజర్ అందుకోలేని స్థాయిలో రామరాజు టీజర్‌ను నిలబెట్టే ఉద్దేశంతో వ్యూస్ పెంచితే అది కాస్తా ‘సరిలేరు..’ పేరిట ఉన్న ఆల్ టైం రికార్డును బద్దలు కొట్టేసింది. ఐతే భీమ్ టీజర్ అప్పుడే 25 మిలియన్ వ్యూస్ మార్కును దాటేయడం గమనార్హం.
This post was last modified on October 31, 2020 3:22 pm
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్‌రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…