ఈ మధ్య కాలంలో ఇండియాలో పెద్ద వివాదానికి దారి తీసిన సినిమా అంటే.. ‘ఎల్2: ఎంపురాన్’ అనే చెప్పాలి. తమ కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘లూసిఫర్’కు కొనసాగింపుగా మోహన్ లాల్-పృథ్వీరాజ్ సుకుమారన్ కలిసి చేసిన ఈ చిత్రం.. రిలీజైన తొలి రోజే పెద్ద వివాదంలో చిక్కుకుంది. ఇందులో ఆరంభ సన్నివేశాలు, కొన్ని పాత్రలు గోద్రా అల్లర్లను గుర్తు చేసేలా ఉండడం.. బీజేపీని టార్గెట్ చేయడంతో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
ఈ వ్యవహారం పార్లమెంటు వరకు వెళ్లింది. ఊహించని వ్యతిరేకతను గమనించిన మోహన్ లాల్ క్షమాపణలు చెప్పడమే కాదు.. సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలను కూడా తీయించేశాడు. ఈ వివాదం వల్ల ఎంత నెగెటివిటీ వచ్చినప్పటికీ ‘ఎంపురాన్’ వసూళ్లకేమీ ఢోకా లేకపోయింది. ఈ సినిమా ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీ హిట్‌గా రికార్డు సృష్టించింది.
తొలి వారాంతంలోనే వంద కోట్ల వసూళ్లు సాధించిన ‘ఎంపురాన్’ ఆ తర్వాత కూడా జోరు కొనసాగించింది. తాజాగా ఈ చిత్రం రూ.250 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మైలురాయిని అందుకుంది. ఇప్పటిదాకా ఏ మలయాళ చిత్రం ఈ మైలురాయిని అందుకోలేదు. రూ.242 కోట్లతో గత ఏడాది ఏడాది కిందట ‘మంజుమ్మల్ బాయ్స్’ నెలకొల్పిన రికార్డును ‘ఎంపురాన్’ దాటేసింది.
మోహన్ లాల్ ఇలా ఇండస్ట్రీ హిట్ కొట్టడం ఇది తొలిసారి కాదు. దృశ్యం, పులి మురగన్, లూసిఫర్.. ఇలా చాలా సినిమాలతో ఆయన పాత కలెక్షన్ల రికార్డులను బద్దలు కొడుతూనే వస్తున్నారు. ఐతే ‘ఎంపురాన్’కు అంత గొప్ప టాక్ రాకపోయినా, వివాదాలు చుట్టుముట్టినా.. అన్నింటినీ దాటుకుని రికార్డు కొట్టడం మాత్రం విశేషమే. కాంట్రవర్శీ నేపథ్యంలో ముందు అనుకున్నట్లుగా ‘లూసిఫర్-3’ రాదేమో అన్న సందేహాలు నెలకొన్నాయి కానీ.. ఇటీవలే చిత్ర బృందం ఆ చిత్రం ఉంటుందని స్పష్టం చేసింది.
This post was last modified on April 5, 2025 6:59 pm
సినిమాల సెన్సార్షిప్ విషయంలో పెద్ద పెద్ద సినిమాలకు కూడా ఈ మధ్య తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో…
వందేళ్ల క్రితం సైమన్ ను రక్షించడానికి ప్రయత్నించిన బ్రిటీష్ ప్రభుత్వం కుప్పకూలిపోయిందని, ఇప్పుడు జ్ఞానేష్ కుమార్ ను రక్షించాలని ప్రయత్నం…
వైసీపీ మాజీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి సగటు రాజకీయ నాయకుడి నుంచి మతపరమైన రాజకీయాలు చేసి…
కాకా జనవరిలో సంక్రాంతి పండక్కు వచ్చేస్తుంది. తక్కువ గ్యాప్ లో విశ్వంభర దిగుతుంది. తర్వాత ఎవరితో సినిమా ఉంటుందనేది చిరంజీవి…
బాలీవుడ్ సుప్రసిద్ధ నటుడు నానా పటేకర్ కన్ను మూయడం ఇండస్ట్రీ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. 75 వయసులో చివరి…
కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో తెరకెక్కినన్ని రీమేక్‌లు మరే భాషలోనూ వచ్చి ఉండవు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు, తమిళంలో హిట్టయిన…