లైగర్, డబుల్ ఇస్మార్ట్ చిత్రాలతో డబుల్ షాక్ తిన్నాడు సీనియర్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈ దెబ్బతో ఆయనకు సినిమా చేయడానికి టాలీవుడ్ హీరోలు భయపడే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు ఎంత వైభవం చూసినా సరే.. ప్రస్తుతం ఆయన ఫామ్ చూసి హీరోలు భయపడ్డంలో ఆశ్చర్యమేమీ లేదు. ఈ స్థితిలో పూరి కొత్త స్క్రిప్టులు రెడీ చేసుకుని వేరే ఇండస్ట్రీల హీరోలను కలవడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ఈ సీనియర్ డైరెక్టర్‌తో సినిమా చేయడానికి ఓకే చెప్పాడు.
ఇది తమిళ ఇండస్ట్రీలో చాలామందికి నచ్చకపోయినా సేతుపతి మాత్రం ఈ చిత్రం మీద ధీమాగానే ఉన్నాడు. ఈ చిత్రానికి నిర్మాతలుగా పూరి, చార్మి లే వ్యవహరించనున్నారు. ఇప్పుడు కాస్ట్ అండ్ క్రూ ఎంపిక పనిలో బిజీ అయ్యాడు పూరి. ఈ ప్రాజెక్టుకు ఒక క్రేజీ అడిషన్ తోడైనట్లు తాజా సమాచారం. బహు భాషా చిత్రాలతో దేశం గర్వించదగ్గ నటీమణుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న టబు ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర చేయబోతోంది. టబు మాత్రమే చేయదగ్గ పాత్ర ఇదట. పూరి తన పాత్రను డిజైన్ చేసిన తీరు, కథ నచ్చి ఆమె ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు.
టబు చేస్తోందంటే ఈ సినిమాకు పాన్ ఇండియా అప్పీల్ వచ్చేసినట్లే. ఇటు సేతుపతి, అటు టబు లాంటి పెర్ఫామర్లు ముఖ్య పాత్రలు పోషిస్తే సినిమాకు వచ్చే క్రేజే వేరుగా ఉంటుంది. ఈ చిత్రంలో సేతుపతి బిచ్చగాడి పాత్రను చేస్తున్నాడట. వ్యవస్థ మీద సెటైర్లతో హార్డ్ హిట్టింగ్‌గా ఈ సినిమా ఉంటుందని సమాచారం. ఈసారి పూరి పూర్తి స్క్రిప్టు రెడీ చేయలేదు. బేసిక్ ఐడియా మాత్రమే ఆయనది. ఇద్దరు కొత్త రచయితలు దాన్ని పకడ్బందీ స్క్రిప్టుగా మార్చారు. వచ్చే నెలలోనే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లనుందని సమాచారం.
This post was last modified on April 6, 2025 11:10 am
ఒక ఢీ.. ఒక రెడీ.. ఒక కింగ్.. ఒక దూకుడు.. ఇలా ఒక దశ వరకు మామూలు హిట్లు ఇవ్వలేదు…
లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధించడంలో నిర్మాతలు బన్నీ వాస్, వంశీ…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం తొలిసారి `విజయ్ దివస్` పేరుతో కీలక కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ నెల 9న(మంగళవారం) రాష్ట్ర వ్యాప్తంగా…
ఒకప్పుడు గోవా అంటే యూత్ కి అదో డ్రీమ్ డెస్టినేషన్. ఫ్రెండ్స్ తో ప్లాన్ వేస్తే ఫస్ట్ గుర్తొచ్చేది గోవానే.…
కేరళలో సంచలనం సృష్టించిన నటి కిడ్నాప్ కేసులో హీరో దిలీప్‌కు ఎనిమిదేళ్ల తర్వాత బిగ్ రిలీఫ్ దక్కింది. ఎర్నాకులం కోర్టు…
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అన్ని విషయాల్లో సోషల్ మీడియా టాపిక్ గా మారిపోయింది. రిలీజ్ ముందువరకు ఏమంత…