సృజనాత్మక విబేధాలు (క్రియేటివ్ డిఫరెన్స్) అనే మాట తరచుగా సినిమా షూటింగ్ సమయంలో వినిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా హీరో, దర్శకుడు, నిర్మాత మధ్య ఏదైనా విభేదాలు తలెత్తినప్పుడు దీన్ని వాడతారు. అంటే ఏదైనా గొడవ పడ్డారనే రేంజ్ లో ఒక్కోసారి ఈ ప్రచారాలు ఎక్కడికో వెళ్లిపోతాయి. ఏప్రిల్ 10 విడుదల కాబోతున్న జాక్ గురించి కూడా ఇలాంటి టాక్ బయటికి వచ్చింది. దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్, హీరో సిద్ధూ జొన్నలగడ్డ మధ్య ఏదో క్రియేటివ్ డిఫరెన్స్ రావడం వల్ల షూటింగ్ ఆలస్యమయ్యిందని, ఒక పాట డైరెక్టర్ లేకుండా షూట్ చేశారని వినిపించింది. మొన్న ప్రెస్ మీట్ లో టీమ్ స్వయంగా క్లారిటీ ఇచ్చింది.
తాజాగా ఈ క్రియేటివ్ డిఫరెన్స్ టాపిక్ గురించి మా ప్రతినిధికిచ్చిన ఇంటర్వ్యూలో సిద్ధూ మరింత లోతుగా వివరించాడు. “సహజంగా ఒక పాయింట్ మీద యూనిట్ లో అభిప్రాయ భేదాలు రావడం మామూలే. అంతమాత్రాన మేమేదో కత్తులు కటార్లు పట్టుకుని కొట్టుకుంటున్నామని కాదు. ఉదాహరణకు ఒక ముఖ్యమైన మలుపుకి సంబంధించి అదంతా జాకే చేస్తున్నాడని ముందే చెప్పాలా, మధ్యలో చెప్పాలా లేక క్లైమాక్స్ లో రివీల్ చేయాలా అనే దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. ఒక్కొక్కరిది ఒక్కో ఒపీనియన్. నూటా అరవై పదాలు ఉండే మీడియా ఆర్టికల్స్ కే ప్రూఫ్ రీడింగ్ ఉన్నప్పుడు రెండున్నర గంటల స్క్రిప్ట్ కి ఉండదా”.
సిద్ధూ జొన్నలగడ్డ లాజిక్ తోనే మాట్లాడాడు. ఎక్కడ ఏ ట్విస్టు పెడితే పండుతుందనే దాని మీద ప్రతి సినిమాకు ఇలాంటి చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఒక్కోసారి చివరి నిమిషం మార్పులు గొప్ప ఫలితాలు ఇస్తాయని పరుచూరి గోపాలకృష్ణ గారు తన యూట్యూబ్ క్లాసుల్లో తరచుగా చెబుతూ ఉంటారు. అండర్ స్టాండింగ్ వస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. లేదంటేనే సమస్యలు వస్తాయి. జాక్ కు అలాంటి ట్రబులేది రాలేదు. స్వతహాగా రచయితైన సిద్ధూ ఇన్ ఫుట్స్ టిల్లుకు ఎంతగా ఉపయోగపడ్డాయో చూశాం. వాటి తర్వాత వస్తున్న సినిమాగా జాక్ మీద అంచనాలు రేగడం సహజం. ఇంకో అయిదు రోజుల్లో ఫలితం వచ్చేస్తుంది.
This post was last modified on April 5, 2025 4:45 pm
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…
నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…
స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…