ఒక సినిమా భారీ నష్టాలు మిగిలిస్తే.. ఆ చిత్రలో భాగమైన వాళ్లు చేసే తర్వాతి చిత్రం మీద దాని ఎఫెక్ట్ పడడం మామూలే. ముఖ్యంగా నిర్మాతలను ముందు చిత్రాల నష్టాలు వెంటాడుతూనే ఉంటాయి. టాలీవుడ్ సీనియర్ నిర్మాతల్లో ఒకరైన బీవీఎస్ఎన్ ప్రసాద్‌కు గత కొన్నేళ్లలో పెద్ద షాక్ అంటే.. ‘గాండీవధారి అర్జున’నే. వరుణ్ తేజ్ హీరోగా పూర్తిగా ఫారిన్ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమాను పెద్ద బడ్జెట్లో నిర్మించారు ప్రసాద్. కానీ ఆ చిత్రం పెద్ద డిజాస్టర్ అయింది. పెట్టుబడి పూర్తిగా వేస్ట్ అయింది. థియేటర్ల నుంచి అయితే పైసా ఆదాయం రాలేదు.
దీంతో కొంత కాలం ప్రొడక్షనే ఆపేశారు ప్రసాద్. మళ్లీ చాలా గ్యాప్ తర్వాత ఆయన నిర్మాణంలో ‘జాక్’ మూవీ తెరకెక్కింది. ఇది కూడా కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయింది. ఎట్టకేలకు ఏప్రిల్ 10న ‘జాక్’ను రిలీజ్ చేయాలని చూస్తుండగా.. ‘గాండీవధారి’ నష్టాలు దీనికి అడ్డం పడుతున్నాయి. ఈ సినిమాను కొని నష్టపోయిన గోదావరి ప్రాంత డిస్ట్రిబ్యూటర్లు ఫిలిం ఛాంబర్లో ఫిర్యాదు చేశారట.
రికవరబుల్ అడ్వాన్స్ కింద సినిమాను కొన్న తాము పూర్తిగా పెట్టుబడి నష్టపోయామని.. తమకు డబ్బులు వెనక్కివ్వలేదని.. ఆ సెటిల్మెంట్ జరిగే వరకు ‘జాక్’ మూవీని రిలీజ్ చేయొద్దని పంచాయితీ పెట్టినట్లు సమాచారం. ఇలాంటి సెటిల్మెంట్ల విషయంలో ఛాంబర్ సీరియస్‌గానే ఉంటుంది. కాబట్టి ఆ వ్యవహారం తేలితే తప్ప ‘జాక్’ను రిలీజ్ చేయడానికి ఉండదు. సిద్ధు సినిమా కావడం వల్ల ‘జాక్’ఖు బిజినెస్ పర్వాలేదనిపించే లాగే జరుగుతున్నట్లు సమాచారం. కాబట్టి నిర్మాత సెటిల్మెంట్‌కు వెళ్లొచ్చు. కానీ మిగతా బయ్యర్లు కూడా ఇదే బాటపడితేనే కష్టం.
This post was last modified on April 4, 2025 6:17 pm
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…