ఏప్రిల్ లో విడుదల కావాల్సిన ధనుష్ ఇడ్లి కడై (ఇడ్లి కొట్టు) ఏకంగా అక్టోబర్ కు వెళ్ళిపోయింది. ఆ నెల ఒకటో తేదీన తమిళ తెలుగుతో పాటు ఇతర భాషల్లో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇది ధనుష్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న ఎమోషనల్ డ్రామా. ఇటీవలే జాబిలమ్మ నీకు అంత కోపమా రూపంలో ఫ్లాప్ చవి చూసిననప్పటికీ ఇడ్లి కొట్టు మీద బోలెడు నమ్మకం పెట్టుకున్నాడు. ఇందులో నిత్య మీనన్ హీరోయిన్ గా నటించగా అరుణ్ విజయ్, షాలిని పాండే, ప్రకాష్ రాజ్ లాంటి ఆసక్తికరమైన క్యాస్టింగ్ అంచనాలు పెంచుతోంది. అయితే డేట్ బాగానే ఉంది కాని పోటీ పరంగా ధనుష్ పెద్ద రిస్కుకు రెడీ అవుతున్నాడు.
ఎందుకంటే అక్టోబర్ 2 కాంతార చాప్టర్ వన్ వస్తుంది. ఇందులో ఎలాంటి మార్పు ఉండదని ఇటీవలే హోంబాలే ఫిలిమ్స్ ప్రకటించింది. సో దాంతో క్లాష్ అంటే ఆషామాషీ కాదు. ఇక్కడితో అయిపోలేదు. వీటికి వారం ముందు సెప్టెంబర్ 25 బాలకృష్ణ అఖండ 2 తాండవం వస్తుంది. ఇన్ సైడ్ టాక్ అయితే మాములుగా లేదు. బోయపాటి శీను పూనకాలు తెప్పించడం ఖాయమంటున్నారు. సాయి ధరమ్ తేజ్ సంబరాల ఏటిగట్టు కూడా అదే రోజు రానుంది. ఒకవేళ ఏదైనా ఒకటి వాయిదా పడే పక్షంలో ప్రభాస్ ది రాజా సాబ్ వచ్చే అవకాశాన్ని కొట్టి పారేయలేం. కాకపోతే ఇంకా పాటల షూటింగ్ బాలన్స్ ఉండటంతో డేట్ ప్రకటించలేదు.
ఇవి కాకుండా జూన్ లేదా జూలై కనక విశ్వంభర మిస్ చేసుకుంటే అది కూడా దసరా పండగనే లక్ష్యంగా పెట్టుకుంటోంది. ఇదంతా చూసి కూడా ధనుష్ తన ఇడ్లి కడైని ఇంత కాంపిటీషన్ లో దింపడం ఆశ్చర్యమే. తాతల నుంచి సంక్రమించిన చిన్న ఇడ్లి కొట్టు నడుపుకునే ఒక యువకుడి జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ధనుష్ ఈ సబ్జెక్టు రాసుకున్నాడు. గత ఏడాది వచ్చిన రాయన్ కు భిన్నంగా ఇడ్లి కొట్టులో ఎక్కువ మాస్ ఎలిమెంట్స్ ఉండవట. అలాంటప్పుడు ప్యాన్ ఇండియా మూవీస్ తో తలపడే రిస్కు చేస్తున్నాడంటే కంటెంట్ ఏదో బలంగా ఉన్నట్టే. అన్నట్టు కుబేర జూన్ 20 విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.
This post was last modified on April 4, 2025 5:50 pm
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…