బాలీవుడ్ ఆల్ టైం టాప్ హీరోల్లో సల్మాన్ ఖాన్ ఒకరు. 90వ దశకంలో ‘మై నే ప్యార్ కియా’తో మొదలుపెట్టి ఆయన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఇచ్చారు. ఒక దశలో సల్మాన్ యావరేజ్ సినిమాలు చేసి కూడా భారీ వసూళ్లు రాబట్టేవారు. ఆయన సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే మూణ్నాలుగొందల కోట్ల వసూళ్లు వచ్చేవి. కానీ గత కొన్నేళ్లుగా సల్మాన్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఆయన సినిమాలు వరుసగా బోల్తా కొడుతున్నాయి. మార్కెట్ అంతకంతకూ పడిపోతోంది. తాజాగా సల్మాన్ నుంచి వచ్చిన ‘సికందర్’ సైతం డిజాస్టర్ బాటే పట్టింది.
ఈ నేపథ్యంలో సల్మాన్ స్క్రిప్ట్ సెలక్షన్ మీద తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మరోవైపు సినిమాలో సల్మాన్ సరిగా ఇన్వాల్వ్ అయినట్లు కనిపించలేదని.. నటన పేలవమని.. ఆయనకు కమిట్మెంట్ లేదని.. ప్రమోషన్లు కూడా మొక్కుబడిగా సాగాయని.. ఇలా రకరకాల విమర్శలు వచ్చాయి. ఈ విమర్శలపై సల్మాన్ ఖాన్ తాజాగా స్పందించాడు. తాను పెద్ద స్టార్ కాబట్టి తనకు ఎవరి సపోర్ట్ అవసరం లేదని చాలామంది అనుకుంటారని.. కానీ అది తప్పని సల్మాన్ వ్యాఖ్యానించాడు. తనకు కమిట్మెంట్ లేదన్న వ్యాఖ్యల మీదా సల్మాన్ స్పందించాడు.
‘‘సినిమాకు సంబంధించిన ప్రతి విషయంలోనూ నేను భాగమవుతాను. నాకు కమిట్మెంట్ లేకపోతే ఇంత పెద్ద స్టార్ అయ్యేవాడిని కాదు. బహుశా బాలీవుడ్‌లోని వారంతా నాకు ఎవరి సపోర్ట్ అవసరం లేదని అనుకుంటున్నారేమో. అందుకే నా సినిమా విషయంలో ఎవరూ స్పందించలేదు. కానీ ప్రతి మనిషికీ మద్దతు కావాలి. నాకూ ఆ రకమైన సపోర్ట్ కావాలి’’ అని సల్మాన్ పేర్కొన్నాడు. మరోవైపు ‘సికందర్’ సినిమాను విమర్శిస్తున్న వారిపై నిర్మాత సాజిద్ నడియాడ్‌వాలా సతీమణి వార్దా ఖాన్ సోషల్ మీడియా వేదికగా యుద్ధం చేస్తున్నారు. సాజిద్.. సల్మాన్ కెరీర్‌ను నాశనం చేస్తున్నాడన్న విమర్శలపై ఆమె మండిపడ్డారు. మీరు త్వరగా కోలుకోవాలంటూ సెటైరిగ్గా పోస్టులు పెట్టి.. తర్వాత వాటిని డెలీట్ చేశారు.
This post was last modified on April 3, 2025 2:22 pm
గత ఏడాది డిసెంబర్ అన్నారు. తర్వాత ఏప్రిల్ అనౌన్స్ చేశారు. ఇప్పుడు దసరా లేదా దీపావళికి రావడం అనుమానమే అంటున్నారు.…
https://youtu.be/2y_DH5gIrCU?si=-Esq17S1eaW7D4yg ఒక టీజర్ కోసం స్టార్ హీరో అభిమానులు ఎదురు చూడటం మాములే కానీ పెద్ది విషయంలో మాత్రం ఇది…
లైగర్, డబుల్ ఇస్మార్ట్ చిత్రాలతో డబుల్ షాక్ తిన్నాడు సీనియర్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈ దెబ్బతో ఆయనకు సినిమా…
వక్ఫ్ సవరణ బిల్లు చట్టంగా మారిపోయింది. ఈ మేరకు వక్ఫ్ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం రాత్రి…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలు దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు ఇప్పటికే ఆర్థిక…