మన దగ్గరేమో ప్యాన్ ఇండియా సినిమాలు విపరీతమైన ఆలస్యాలకు లోనవుతూ, విడుదల తేదీలు మార్చుకుంటూ నానా తిప్పలు పడుతున్న వైనాన్ని చూస్తున్నాం. దెబ్బకు స్టార్ హీరోలు రెండేళ్లకు ఒక సినిమా రిలీజ్ చేయడమే గగనంగా ఫీలవుతున్నారు. అలాంటిది ఏడు పదుల వయసు దాటిన తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తగ్గేదేలే సూత్రంతో దూసుకుపోతున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలి లాంటి భారీ బడ్జెట్ చిత్రాన్ని కేవలం ఆరు నెలల వ్యవధిలో పూర్తయ్యేలా చేసిన తలైవా ఇప్పుడు అదే వేగంతో జైలర్ 2 ని పరుగులు పెట్టించబోతున్నారు. ఇది కూడా ఈ ఏడాది చివర్లోగా ఫస్ట్ కాపీ రెడీ అయిపోతుంది.
ప్రస్తుతం జైలర్ 2 టీమ్ కేరళ అట్ఠపాడిలో భారీ సెట్లను నిర్మిస్తోంది. ఇవి ఇంకో నాలుగైదు రోజుల్లో అందుబాటులోకి వస్తాయి. ఏప్రిల్ 10 నుంచి ఏకధాటిగా ఇక్కడ పెద్ద షెడ్యూల్ చేయబోతున్నారు. రజిని పాత్రకు సంబంధించిన ఎపిసోడ్లని కేవలం 15 నుంచి 20 రోజుల్లోపే పూర్తి చేసేలా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ పక్కా ప్రణాళికతో ఉన్నట్టు సమాచారం. కీలక క్యాస్టింగ్ మొత్తం ఇందులో పాల్గొనబోతున్నారు. మండుటెండల్లో ఇంత సుదీర్ఘమైన షూట్ కు మాములుగా యూత్ హీరోలే జంకుతారు. అలాంటిది రజనీకాంత్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం మాములు విషయం కాదు. తర్వాత చిత్రీకరణ చెన్నైకి షిఫ్ట్ అవుతుందట.
చెన్నై వర్గాల కథనం ప్రకారం జైలర్ 2 వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసే ఆలోచనలో సన్ పిక్చర్స్ ఉందని సమాచారం. అయితే అదే సమయంలో విజయ్ చివరి సినిమా జన నాయగన్ ఉండటం వల్ల క్లాష్ వద్దని రజిని సూచించడంతో మార్చి ఆప్షన్ వైపు చూస్తున్నారని తెలిసింది. జైలర్ 1లో ఉన్న క్యాస్టింగ్ తో పాటు ఈసారి కొత్త విలన్లు, నటీనటులు తోడవ్వబోతున్నారు. బాలకృష్ణ క్యామియో ఉంటుందనే ప్రచారం జరుగుతోంది కానీ సన్ బృందం ఇంకా నిర్ధారించలేదు. శివరాజ్ కుమార్, మోహన్ లాల్ క్యామియోలు కంటిన్యూ అవుతాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం గురించి ఈసారి అంచనాలు రెట్టింపు కాబోతున్నాయి.
This post was last modified on April 2, 2025 9:54 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…
ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…
ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…