Movie News

చైతూ మైల్‌స్టోన్ మూవీ.. కొత్త దర్శకుడితో?

అక్కినేని నాగచైతన్యకు చాలా కాలానికి ఓ మంచి హిట్ పడడంతో ఊపిరి పీల్చుకున్నారు. థాంక్యూ, కస్టడీ లాంటి డిజాస్టర్ల తర్వాత చైతూ నుంచి ఈ ఏడాది వచ్చిన ‘తండేల్’ బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నే అందుకుంది. ఈ ఉత్సాహంలో చైతూ తన కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కుతున్న సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. ‘విరూపాక్ష’ దర్శకుడు కార్తీక్ దండు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ‘విరూపాక్ష’ తరహాలోనే ఇది కూడా మిస్టిక్ థ్రిల్లరే. ఇది చైతూకు 24వ చిత్రం.

దీని తర్వాత చైతూ కెరీర్లో మైల్ స్టోన్ మూవీ అయిన 25వ చిత్రానికి దర్శకుడు ఖరారైనట్లు సమాచారం. ఈ స్పెషల్ ప్రాజెక్టును కిిశోర్ అనే కొత్త దర్శకుడి చేతికి అప్పగించారట. అతను చెప్పిన కథకు ఇటీవలే చైతూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచాచారం. 25వ చిత్రం కోసం కొంత కాలంగా కథలు వింటున్నాడు చైతూ. ఐతే కొత్త దర్శకుడైన కిశోర్ ఓ వెరైటీ కథతో చైతూను మెప్పించినట్లు సమాచారం. కమర్షియల్ టచ్ ఉంటూనే కొత్తగా ఉండే సినిమా ఇదట. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే చేద్దామని కూడా చూస్తున్నారట. లేదంటే ఏదైనా బయటి బేనర్ కూడా రంగంలోకి దిగొచ్చు.

మరోవైపు చైతూ తండ్రి నాగార్జున ఇంకా పెద్ద మైలురాయి ముంగిట నిలిచారు. హీరోగా ఆయన వందో చిత్రం గురించి చాన్నాళ్లుగా చర్చ జరుగుతోంది. తమిళ దర్శకుడైన నవీన్ ఆ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తాడని వార్తలొచ్చాయి. కానీ ఇంకా ఏదీ ఖరారు కాలేదు. నాగ్ 100వ సినిమా, చైతూ 25వ సినిమా దాదాపుగా ఒకే సమయంలో సెట్స్ మీదికి వెళ్లేలా కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఇవి పట్టాలెక్కొచ్చు.

This post was last modified on April 2, 2025 6:14 pm

Share

Recent Posts

పరీక్షలు బాగా రాపించి సినిమాకి తీసుకురండి

చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…

24 minutes ago

హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు ఏపీ సర్కార్?

ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…

53 minutes ago

ఏపీలో బీసీ రిజర్వేషన్లపై సంచలన తీర్పు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…

2 hours ago

అక్టోబర్ మార్కెట్… ఎవరెవరికి జాక్‌‌పాట్

కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…

2 hours ago

రాజమౌళి టచ్ చేసిన స్క్రిప్ట్… హిట్ కొడతారా?

గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…

3 hours ago

దృశ్యం బ్రాండ్ విలువ మహత్యం

బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…

3 hours ago