Movie News

పూరిపై దండెత్తుతున్న తమిళ ఫ్యాన్స్

ఒకప్పుడు తెలుగులో భారీ విజయాలు అందుకున్న పూరి జగన్నాథ్.. గత దశాబ్ద కాలంగా తీవ్రంగా ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ‘టెంపర్’ తర్వాత ఆయనకు దక్కిన ఏకైక హిట్ ‘ఇస్మార్ట్ శంకర్’ మాత్రమే. కానీ అది కూడా ఫ్లూక్ హిట్ అనిపించేలా తర్వాత తీసిన ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రాలు డిజాస్టర్లు అయ్యాయి. దీంతో ఆయనతో పని చేయడానికి మిడ్ రేంజ్ తెలుగు హీరోలు కూడా వెనుకంజ వేస్తున్న పరిస్థితి. దీంతో ఆయన వేరే భాషా హీరోల వైపు చూశారు. కొందరు బాలీవుడ్ హీరోలను ట్రై చేసి ఫెయిలైన పూరి.. ఇటీవలే విజయ్ సేతుపతితో సినిమాను ఓకే చేయించుకున్నాడు. వీరి కలయికలో సినిమా అతి త్వరలోనే సెట్స్ మీదికి వెళ్లబోతోంది.

పూరితో కలిసి విజయ్ సేతుపతి దిగిన ఫొటో బయటికి రావడంతో ఈ ప్రాజెక్టు కన్ఫమ్ అయిందని తేలిపోయింది. ఐతే ఈ అప్‌డేట్ బయటికి వచ్చినప్పటి నుంచి తమిళ సినీ అభిమానులు సోషల్ మీడియాలో గొడవ గొడవ చేస్తున్నారు. గత ఏడాది ‘మహారాజా’తో బ్లాక్ బస్టర్ కొట్టాడు సేతుపతి. దాని తర్వాత హీరోగా ఓకే చేసిన కొత్త చిత్రం పూరీదే. ఇంత మంచి విజయం దక్కాక పోయి పోయి డిజాస్టర్లలో ఉన్న పూరీతో సినిమా ఏంటి అని వాళ్లు సేతుపతిని ప్రశ్నిస్తున్నారు. కొందరు తమిళ మీడియా వాళ్లు కూడా పూరితో సేతుపతి జట్టు కట్టడంపై ఎద్దేవా చేస్తూ పోస్టులు పెట్టి తమిళ అభిమానులను రెచ్చగొడుతున్నారు.

పూరీని కించపరిచేలా పోస్టులు పెడుతున్నారు. ఒక అభిమాని అయితే పూరి మీద దారుణంగా కామెంట్ చేయగా.. శాంతను భాగ్యరాజ్ అనే నటుడు అతణ్ని మందలిస్తూ రిప్లై ఇచ్చాడు. పూరి లాంటి పెద్ద దర్శకుడి గురించి అలా మాట్లాడొద్దని అతడికి హితవు పలికాడు. దీంతో ఆ వ్యక్తి పోస్టు డెలీట్ చేశాడు. కానీ ఇలా చాలామంది పూరి మీద నెగెటివిటీ చూపిస్తూ.. సేతుపతిని నిలదీస్తూనే ఉన్నారు. వీళ్లందరికీ పూరి తన సినిమాతో బదులు చెబుతారేమో చూడాలి.

This post was last modified on April 2, 2025 3:19 pm

Share

Recent Posts

టాలీవుడ్ ఇంటర్వ్యూల తీరు మారిపోయింది

గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…

33 minutes ago

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

3 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

4 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

4 hours ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

5 hours ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

5 hours ago