Movie News

కాపీ సినిమా తీసి ఆస్కార్‌కు పంపించారా?

లాపతా లేడీస్.. రెండేళ్ల ముందు విడుదలై ఘనవిజయం సాధించిన హిందీ చిత్రం. ఆమిర్ ఖాన్ నిర్మాణంలో ఆయన మాజీ భార్య కిరణ్ రావు ఈ చిత్రాన్ని రూపొందించింది. ఇండియా తరఫున ఆస్కార్ ఎంట్రీకి కూడా ఎంపికైందీ సినిమా. కానీ అకాడమీ అవార్డు మాత్రం దక్కలేదు. ఐతే అనేక అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమై ప్రశంసలతో పాటు అవార్డులూ దక్కించుకుందీ చిత్రం. థియేటర్లలో మంచి స్పందన తెచ్చుకున్న ఈ సినిమా.. ఓటీటీలో మరింత ఆదరణ దక్కించుకుంది.

గత కొన్నేళ్లలో బాలీవుడ్ నుంచి వచ్చిన బెస్ట్ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది. ఐతే గొప్ప సినిమాగా పేరు తెచ్చుకున్న ఈ మూవీని కాపీ కొట్టి తీశారనే ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. 2019లో విడుదలైన అరబిక్ చిత్రం ‘బుర్ఖా సిటీ’కి ఇది ఫ్రీమేక్ అనే ప్రచారం జరుగుతోంది.

‘బుర్ఖా సిటీ’లో కొత్తగా పెళ్లయిన ఓ వ్యక్తి తన భార్యను మిస్ అవుతాడు. బుర్ఖా వేసుకున్న వేరే యువతిని తన భార్య అనుకుని వెంట తీసుకెళ్తాడు. తర్వాత చూస్తే తన భార్య మారిపోయిందని తెలుసుకుంటాడు. తప్పిపోయిన తన భార్యను వెతికి కనిపెట్టి తెచ్చుకునే నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ‘లాపతా లేడీస్’ స్టోరీ కూడా దాదాపుగా ఇలాగే ఉంటుంది. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు వేర్వేరు యువతులకు పెళ్లవుతుంది. కొత్త పెళ్లి కూతుళ్ల అవతారంలో రైల్లో ప్రయాణిస్తుండగా.. ముఖానికి పరదా పెట్టుకోవడంతో కన్ఫ్యూజ్ అయి ఒక వ్యక్తి తన భార్య అనుకుని వేరే అమ్మాయిని వెంట తీసుకెళ్లిపోతాడు.

ఆ తర్వాత తన భార్యను తిరిగి తీసుకురావడానికి అతను చేసే పోరాటం ఎంత మేర ఫలించింది.. తన వెంట వచ్చిన అమ్మాయి వ్యవహారం ఏంటి.. ఈ నేపథ్యంలో సినిమా రసవత్తరంగా నడుస్తుంది. మొత్తం సినిమాను కాపీ కొట్టారని చెప్పలేం కానీ.. కాన్సెప్ట్ అయితే ‘బుర్ఖా సిటీ’ నుంచే తీసుకున్నట్లుంది ‘లాపతా లేడీస్’ టీం. అయినా సరే.. కాన్సెప్ట్ కాపీ కొట్టి తీసిన సినిమాను ఆస్కార్ ఎంట్రీకి పంపడం ఏంటి అంటూ టీం మీద ఇప్పుడు నెటిజన్లు మండిపడుతున్నారు.

This post was last modified on April 2, 2025 2:44 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఫ్లో లో క‌థేంటో చెప్పేసిన హీరో

కొంద‌రు ఫిలిం మేక‌ర్స్ త‌మ సినిమా క‌థేంటో చివ‌రి వ‌ర‌కు దాచి పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. నేరుగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాల‌నుకుంటారు.…

1 hour ago

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

3 hours ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

3 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

3 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

5 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

6 hours ago