మెగాస్టార్ చిరంజీవి చివరి సినిమా ‘భోళా శంకర్’ ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో తెలిసిందే. దీంతో చిరు తర్వాతి సినిమా మీద అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ‘బింబిసార’తో బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చిన వశిష్ఠ దర్శకత్వంలో మొదలైన ‘విశ్వంభర’ మెగా అభిమానుల్లోనే కాక సామాన్య ప్రేక్షకుల్లోనూ బాగానే ఆసక్తి రేకెత్తించింది.
టైటిల్ దగ్గర్నుంచి అన్నీ పాజిటివ్‌గా కనిపించాయి. కానీ టీజర్ రిలీజయ్యాక కథ అడ్డం తిరిగింది. అందులో విజువల్స్, వీఎఫెక్స్ చాలా పూర్‌గా కనిపించడంతో సినిమా చుట్టూ నెగెటివిటీ ముసురుకుంది. దీంతో వీఎఫెక్స్ మీద మళ్లీ కొత్తగా పని చేయడం మొదలుపెట్టారు. దీంతో సంక్రాంతి రిలీజ్ అనుకున్న సినిమా కాస్తా వాయిదా పడిపోయింది. ఐతే వేసవిలో అయినా సినిమా రిలీజవుతుందా అంటే అలాంటి సంకేతాలేమీ కనిపించడం లేదు. కొన్ని నెలలుగా సినిమా నుంచి ఏ అప్‌డేట్ లేదసలు.
ఇంతలో చిరు అనిల్ రావిపూడితో సినిమా మొదలుపెట్టారు. గత నెల రోజులుగా దీని గురించే వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది. షూటింగ్ మొదలు కాబోతున్న సందర్భంగా ఈ రోజు చిన్న ప్రమోషనల్ గ్లింప్స్ కూడా వదిలారు. అది కూడా హుషారు పుట్టించేలా ఉంది. ఆల్రెడీ ఈ సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయిపోయింది. ఐతే చిరు 157 విషయం జోష్ బాగుంది కానీ.. దీని కంటే ముందు సినిమా గురించి మాత్రం అసలు సౌండే లేకపోవడం ఆశ్చర్యకరం. ఈ సినిమాను చిరు పక్కన పెట్టేశారని.. అనిల్ సినిమానే పూర్తి చేసి ముందు రిలీజ్ చేస్తారని ఇటీవల వార్తలు వచ్చాయి.
ఐతే అనిల్ సినిమా ప్రారంభోత్సవంలో వశిష్ఠ కూడా పాల్గొన్నాడు. చిరుతో సన్నిహితంగానే మెలిగాడు. సినిమాను పక్కన పెట్టేసి ఉంటే అతనీ వేడుకలో పాల్గొనేవాడే కాదేమో. అయినా వందల కోట్లు పెట్టి తీస్తున్న ‘విశ్వంభర’ను పూర్తిగా పక్కన పెట్టేశారంటే ఎలా నమ్ముతాం? ‘విశ్వంభర’ కచ్చితంగా రెడీ అవుతుందని. ఈ ఏడాదే రిలీజవుతుందని మెగా ఫ్యాన్స్ ఆశాభావంతోనే ఉన్నారు. కానీ నెలల తరబడి అప్‌డేట్ లేకుండా, రిలీజ్ గురించి అయోమయం నెలకొంటే మూవీపై బజ్ తగ్గిపోతుంది. కాబట్టి ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా అప్‌డేట్స్, కంటెంట్ ఇవ్వాల్సిన అవసరం చిత్ర బృందం మీద ఉంది. ఆ పని ఎంత త్వరగా చేస్తే అంత మంచిది.
This post was last modified on April 1, 2025 11:11 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…