‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఉత్తరాది అమ్మాయి.. షాలిని పాండే. మన సినిమాల్లో మామూలుగా కనిపించే గ్లామర్ హీరోయిన్లకు భిన్నమైన పాత్రలో ఆమె సటిల్‌గా యాక్ట్ చేసి మెప్పించింది. బోల్డ్ సీన్లలోనూ ధైర్యంగా నటించింది. ఐతే ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్నందుకున్నప్పటికీ షాలిని కెరీర్ అనుకున్నంతగా ముందుకు సాగలేదు.
మహానటి, యన్.టి.ఆర్ లాంటి చిత్రాల్లో చిన్న పాత్రలు చేసిన ఆమె.. 118, ఇద్దరి లోకం ఒకటే లాంటి చిత్రాల్లో కథానాయికగా చేసింది. తొలి సినిమా తర్వాత సరైన బ్రేక్ రాకపోవడంతో ఆమె కనుమరుగైపోయింది. మధ్యలో 100 పర్సంట్ కాదల్ (100 పర్సంట్ లవ్ రీమేక్), గొరిల్లా లాంటి తెలుగు చిత్రాల్లో సైతం నటించింది. ప్రస్తుతం హిందీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేసుకుంటున్న షాలిని.. ఓ ఇంటర్వ్యూలో ఓ సంచలన విషయంతో వార్తల్లోకి వచ్చింది.
తాను నటించిన ఓ దక్షిణాది చిత్రం షూటింగ్ సందర్భంగా దర్శకుడు తనతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఆమె వెల్లడించింది. తాను వ్యానిటీ వ్యాన్‌లో బట్టలు మార్చుకుంటుండగా.. కనీసం డోర్ కొట్టకుండా ఆ దర్శకుడు లోపలికి వచ్చేశాడని ఆమె వెల్లడించింది. తన వయసు అప్పుడు 22 ఏళ్లని, ఓ సగటు అమ్మాయిలా అప్పుడు ప్రవర్తించానని.. గట్టిగా అరిచేశానని.. ఆ దర్శకుడిని చెడామడా తిట్టేశానని ఆమె తెలిపింది. అది దక్షిణాది చిత్రం అని మాత్రమే అని చెప్పిన షాలిని.. తెలుగా, తమిళమా అన్నది మాత్రం వెల్లడించలేదు. దీంతో షాలినితో అలా ప్రవర్తించిన దర్శకుడెవరన్నది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
షాలిని నటించిన తెలుగు, తమిళ చిత్రాల లిస్ట్ తీసి.. వాటి దర్శకుల గురించి ఆరాలు తీస్తున్నారు నెటిజన్లు. షాలిని నటించిన ‘డబ్బా కార్టెల్’ సిరీస్ ఇటీవలే హాట్ స్టార్‌లో రిలీజై మంచి స్పందనే తెచ్చుకుంది. ప్రస్తుతం దక్షిణాదిన ఆమెకు అవకాశాలేమీ రావట్లేదు.
This post was last modified on April 1, 2025 3:36 pm
ప్రభుత్వ వైద్య సేవల గురించి పెదవి విరవని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. వాస్తవ పరిస్థితులు అలా ఉన్నాయి మరి.…
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో మొదలైన పార్టీ వైసీపీ..ఎందరో నేతలను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. కొందరిని అసెంబ్లీలోకి అడుగుపెట్టిస్తే… మరికొందరిని…
ఆర్ మాధవన్, నయనతార, సిద్దార్థ్. ఈ మూడు పేర్లు చాలు ఒక కంటెంట్ మీద ఆసక్తి పుట్టి సినిమా చూసేలా…
దేవర టైంలో ప్రత్యక్షంగా తనను పబ్లిక్ స్టేజి మీద చూసే అవకాశం రాలేదని ఫీలవుతున్న అభిమానుల కోసం ఇవాళ జూనియర్…
నిజమే.. లెక్కంటే లెక్కే. ఏదో చేతికి వచ్చినంత ఇచ్చుకుంటూ పోతే ఎక్కడో ఒక చోట బొక్క బోర్లా పడిపోతాం. అలా…
వైసీపీ మాజీ మంత్రి, కీలక నాయకుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.…