ఇటీవలే విడుదలైన వీరధీరశూర పార్ట్ 2కు పాజిటివ్ టాక్, రివ్యూస్ వచ్చిన మాట వాస్తవం. చూసింది తక్కువ ప్రేక్షకులే అయినా అధిక శాతం బాగుంది ఓసారి చూడొచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ కలెక్షన్లు ఆ దిశగా లేకపోవడం చియాన్ అభిమానులను తెగ బాధిస్తోంది. తమిళంలో వసూళ్లు బాగానే ఉన్నాయి కానీ మరీ రికార్డులు బద్దలు కొట్టే స్థాయిలో లేకపోవడం కోలీవుడ్ ట్రేడ్ ని ఆందోళనకు గురి చేస్తోంది. మొదటి రోజు ఆర్థిక కారణాల వల్ల ఉదయం, మధ్యాన్నం రెండు మూడు షోలు దేశవ్యాప్తంగా క్యాన్సిల్ కావడం చాలా తీవ్ర ప్రభావం చూపించింది. బుక్ చేసుకుని రీ ఫండ్ అందుకున్న చాలామంది మళ్ళీ టికెట్లు కొనలేదు.
నిజం చెప్పాలంటే చాలా గ్యాప్ తర్వాత విక్రమ్ ఒక ప్రాపర్ మాస్ మూవీలో కనిపించాడు. కంటెంట్ పరంగా హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ అవి మరీ తీవ్రంగా లేనందు వల్ల డీసెంట్ టాక్ సాధ్యమయ్యింది. కానీ అది బాక్సాఫీస్ దగ్గర టికెట్లు తెంపేందుకు ఉపయోగపడలేదు. ముఖ్యంగా ఏపీ, తెలంగాణలో వీరధీరశూర ఎదురీదుతోంది. మ్యాడ్ స్క్వేర్ ప్రభంజనం ఒకవైపు, ఎల్2 ఎంపురాన్ కు దక్కిన మంచి రిలీజ్, రాబిన్ హుడ్ థియేటర్ల కేటాయింపు తదితర కారణాలు ఓపెనింగ్స్ మీద ఎఫెక్ట్ చూపించాయి. మెల్లగా అయినా పికప్ అవుతుందనే అంచనాలకు భిన్నంగా ఆది సోమవారం సెలవుల్లో ఏ మేజిక్ జరగలేదు.
ఫైనల్ గా చెప్పాలంటే విక్రమ్ కష్టమైతే పడ్డాడు కానీ మళ్ళీ దెబ్బ తిన్నాడు. పోనీ తమిళంలో రికార్డులు బద్దలు కొడితే సంతోషించే వాడేమో కానీ అక్కడా డీసెంట్ హిట్ దగ్గరే ఆగిపోయేలా ఉందని ట్రేడ్ అభిప్రాయం. పోటీ వల్ల ఇలా జరిగిందా లేక ఇంకేదైనా కారణమా అనేది పక్కనపెడితే విక్రమ్ శ్రమ మాత్రం బూడిదలో పోసిన పన్నీరవుతోంది. తంగలాన్ దర్శకుడి వల్ల, కోబ్రా కంటెంట్ లో కన్ఫ్యూజన్ వల్ల, పొన్నియిన్ సెల్వన్ మల్టీస్టారర్ కావడం వల్ల ఇలా ఎన్నో కారణాలు విక్రమ్ కు సోలో క్రెడిట్ రాకుండా అడ్డుపడ్డాయి. గౌతమ్ మీనన్ ధృవ నక్షత్రం అసలు ఏడు సంవత్సరాల నుంచి ల్యాబులోనే మగ్గిపోవడం ఫైనల్ ట్విస్టు.
This post was last modified on April 1, 2025 3:44 pm
టెక్ జనమంతా సింపుల్ గా శామ్ ఆల్ట్ మన్ అని పిలుచుకునే శామ్యూల్ హారిస్ ఆల్ట్ మన్… భారత్ లో…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లోనే మోస్ట్ వయొలెంట్ మూవీగా చెప్పబడుతున్న ది ప్యారడైజ్ ఇంకా రెగ్యులర్ షూటింగ్ కి…
వైసీపీ ప్రభుత్వం పర్యాటక, యువజన శాఖల విషయంలో అప్పటి మంత్రులు తీసుకున్న నిర్ణయాలు.. ఇచ్చిన జీవోలపై పునః సమీక్షకు కూటమి…
హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ పరిధిలోని 400 ఎకరాల భూముల విషయంలో తెలంగాణ సర్కారుకు గురువారం డబుల్ షాక్ తగిలింది. ఈ…
ఇప్పుడంతా సీక్వెల్స్ ట్రెండ్. ఒక సినిమాకు ఎంత క్రేజ్ ఉందో ముందే గుర్తిస్తున్న దర్శకులు దానికి అనుగుణంగా పార్ట్ 2…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి వర్గ విస్తరణ అంశం.. మరోసారి వాయిదా పడినట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఈ నెల…