హర్షవర్ధన్ రాణె గుర్తున్నాడా.. నటి భూమిక నిర్మించిన ‘తకిట తకిట’తో అతను హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ‘మాయ’ అనే నీలకంఠ సినిమాలోనూ ప్రధాన పాత్ర పోషించాడు. మరికొన్ని సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ కూడా చేశాడు. ఉత్తరాది వాడే అయినా ఎక్కువగా సినిమాలు చేసింది తెలుగులోనే. మధ్యలో బాలీవుడ్లో అవకాశాలు వస్తే అటు వెళ్లిపోయాడు. హీరోగా అక్కడ కొన్ని సినిమాలు చేశాడు.
ఐతే సినిమాలతో కంటే వ్యక్తిగత వ్యవహారాలతోనే రాణె ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటాడు. మంచి ఫిజిక్ ఉన్న, అందగాడైన రాణెతో కొంత కాలం బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల డేటింగ్ చేసింది. వాళ్లు ఒక దశలో పెళ్లి చేసుకుంటారన్న ప్రచారం కూడా జరిగింది. కానీ తన బేస్‌ను ముంబయికి మార్చాక రాణె.. జ్వాలకు దూరమయ్యాడు. ఆమె కూడా కొత్త తోడును వెతుక్కుంది. తమిళ నటుడు విష్ణు విశాల్‌తో ప్రేమలో పడి.. ఇటీవలే అతడితో నిశ్చితార్థం కూడా చేసుకుంది.
రాణె విషయానికి వస్తే.. ముంబయికి వెళ్లిన కొంత కాలానికే ఒకప్పటి కథానాయిక ‘ఖడ్గం’లోనూ నటించిన కిమ్ శర్మతో ప్రేమలో పడ్డాడు. ఆమె ఒకప్పుడు క్రికెటర్ యువరాజ్ సింగ్‌తో డేటింగ్ చేసింది. తర్వాత ఇంకెవరితోనో రిలేషన్‌షిప్ అన్నారు. రాణె పరిచయమయ్యాక ఇద్దరూ బాగా దగ్గరైపోయారు. ఇద్దరూ కలిసి జీవితాన్ని పంచుకోవడానికి సిద్ధమైనట్లు కూడా కనిపించారు. కానీ చివరికి ఈ బంధం కూడా నిలబడలేదు. కిమ్ నుంచి తాను విడిపోయినట్లు రాణె స్వయంగా సోషల్ మీడియా పోస్టుతో వెల్లడించాడు.
‘‘నీతో గడిపిన సమయం అద్భుతంగా సాగింది. ఆ దేవుడు నిన్నూ, నన్ను దీవించాలని కోరుకుంటున్నా. సెలవు’’ అనే మెసేజ్‌తో కిమ్‌తో తన ప్రేమాయణం ముగిసిందని సంకేతాలిచ్చాడు రాణె. తాము విడిపోవడానికి బలమైన కారణమే ఉందని రాణె చెప్పాడు. కిమ్ నుంచి విడిపోతూ ఆమె గురించి చాలా మంచి మాటలే చెప్పి తన హుందాతనాన్ని చాటుకున్నాడు రాణె.
This post was last modified on October 30, 2020 6:31 pm
నాలుగు గంటల విచారణలో అన్నీ ముక్తసరి సమాధానాలే..! కొన్నిటికి మౌనం, మరికొన్నిటికి తెలియదు అంటూ దాటవేత.. విచారణలో ఇదీ సీఐడీ…
తెలుగు సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న అరంగేట్రాల్లో అకీరా నందన్‌ది ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…
అనిల్ రావిపూడిని టాలీవుడ్లో అందరూ హిట్ మెషీన్ అంటారు. దర్శక ధీరుడు రాజమౌళి తర్వాత అపజయం లేకుండా కెరీర్‌ను సాగిస్తున్న…
అమెరికా వెళ్లాలి, బాగా సంపాదించి ఇండియా వచ్చి సెటిల్ అవ్వాలి అనేది చాలామంది మిడిల్ క్లాస్ కుర్రాళ్ళ కల. కానీ…
బలంగా మాట్లాడాలి. మాటకు మాట కౌంటర్ ఇవ్వాలి. అది వింటే ప్రత్యర్థులు నోరు అప్పగించాలి!. రాజకీయాల్లో ఇప్పుడు ఇదే ట్రెండ్…