సినిమాలతో ఎంటర్ టైన్ చేయడంలోనే కాదు ప్రమోషన్ల విషయంలోనూ దర్శకుడు అనిల్ రావిపూడిది ప్రత్యేక ముద్ర. ముఖ్యంగా సంక్రాంతికి వస్తున్నాంని జనంలోకి తీసుకెళ్లిన తీరుని తర్వాత ఎందరో ఫాలో అయ్యారు కానీ ఆ ఫలితాన్ని మాత్రం అందుకోలేకపోయారు. మాములుగా రిలీజ్ టైంలో పబ్లిసిటీ హోరెత్తించే ట్రెండ్ కి భిన్నంగా ఈసరి షూటింగ్ దశ నుంచే మొదలుపెట్టాడు రావిపూడి. చిరంజీవి హీరోగా తన దర్శకత్వంలో రూపొందబోయే మెగా 157కి రెండున్నర నిముషాల వీడియో ప్రోమో తీయించి తన టీమ్ మొత్తాన్ని దాని ద్వారా పరిచయం చేయడమనే కొత్త సంప్రదాయానికి తెరతీయడం విశేషం.
సాంకేతిక బృందంలో రచయితల దగ్గరి నుంచి నిర్మాతల అన్ని గ్రూపులకు ఒక్కో చిరంజీవి బ్లాక్ బస్టర్ల కటవుట్లు పెట్టించి వాటి ముందు ఆయా టెక్నీషియన్ల ఇంట్రో చేయించారు. చూడాలని ఉంది, మాస్టర్, ఇంద్ర, గ్యాంగ్ లీడర్, అన్నయ్య, ముఠామేస్త్రి, హిట్లర్ ఇలా చిరు సూపర్ హిట్ల రెఫరెన్సులు వాడుకుంటూ మాట్లాడుకునే విధానం బాగుంది. అప్పుడెప్పుడో ఈవివి సత్యనారాయణ గారు టైటిల్ కార్డులో ఆర్టిస్టులు, పని చేసినవాళ్లు ఫోటోలు చూపించేవారు. ఇప్పుడు రావిపూడి మరో కొత్త స్టయిల్ కి తెరతీశారు. వీడియో చివర్లో రఫ్ఫాడిద్దాం అంటూ చిరంజీవి, అనిల్ రావిపూడి కలిసి అరవడం అభిమానులకు మంచి జోష్ ఇచ్చేలా ఉంది.
తొమ్మిది నెలల ముందుగానే ఇలాంటి ప్రమోషన్లు చేయడం అనిల్ రావిపూడికే చెల్లింది. రిలీజ్ కు ఇంకా చాలా టైం ఉన్నప్పటికీ ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతున్న మార్కెటింగ్ అంచనాలు పెంచేలా ఉంది. 2026 సంక్రాంతికి విడుదల చేయడం లక్యంగా పెట్టుకున్న ఈ మెగా ఎంటర్ టైనర్ ఇంకా డేట్ ఫిక్స్ చేసుకోలేదు కానీ సీజన్ మిస్ కావడం మాత్రం ఉండదు. హీరోయిన్ల పేర్లు ఇంకా ఖరారు కాలేదు. అదితిరావు హైదరి, పరిణితి చోప్రా అంటూ రెండు మూడు పేర్లు వినిపిస్తున్నాయి కానీ ఇంకా అఫీషియల్ గా తెలియాల్సి ఉంది. విశ్వంభర రిలీజ్ కు ముందే మెగా 157 చిత్రీకరణను వేగవంతం చేయబోతున్నారు.
This post was last modified on April 1, 2025 2:22 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…