విద్యాబాలన్.. బాలీవుడ్లో మంచి స్థాయి ఉన్న కథానాయిక. ఆమె కథానాయికగా మంచి ఫాంలో ఉన్న టైంలో తెలుగులో నటింపజేయడానికి ప్రయత్నాలు జరిగాయి కానీ.. ఫలితం లేకపోయింది. ఐతే హీరోయిన్ వేషాలు తగ్గిపోయిన టైంలో నందమూరి బాలకృష్ణకు జోడీగా సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ ‘యన్.టి.ఆర్’లో నటించింది. అందులో ఆమెది ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్ర. సినిమా ఆడలేదు కానీ.. విద్యా చాలా బాగా నటించి మెప్పించింది. బాలయ్యతో ఆమెకు జోడీ కూడా బాగానే కుదిరింది.
రిజల్ట్ గురించి ఆలోచించకుండా ఇప్పుడు మళ్లీ విద్యాతో బాలయ్య నటించబోతున్నట్లు సమాాచారం. ఆయన కొత్త చిత్రం ‘అఖండ-2’లో ఒక కీలక పాత్ర పోషించబోతున్నట్లు సమాచారం. విద్యా కథానాయికల్లో ఒకరా అన్న దానిపై స్పష్టత లేదు. కానీ ఆమె ఈ చిత్రంలో నటిస్తుండడం మాత్రం వాస్తవమట.
‘అఖండ’కు సీక్వెల్ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ‘అఖండ’ ఓటీటీలో రిలీజయ్యాక హిందీ ప్రేక్షకులు కూడా ఎగబడి చూశారు. దీంతో ఈసారి సీక్వెల్‌ను పాన్ ఇండియా స్థాయిలో భారీగా రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకే ఆర్టిస్టులను కూడా వేర్వేరు భాషల నుంచి తీసుకుంటున్నారు. విద్యా నటిస్తే హిందీ ఆడియన్స్ బాగానే కనెక్ట్ అవుతారు.
14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన ఒక భారీ సెట్లో యాక్షన్ ఘట్టాలు చిత్రీకరిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబరు 28న సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఆ సమయానికి సినిమా రెడీ అవడం సందేహమే అని.. ఏడాది చివరికి వాయిదా పడొచ్చని అంటున్నారు.
This post was last modified on March 31, 2025 9:13 pm
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య, తదనంతరం…
దేశవ్యాప్తంగా చాలా కాలంగా చర్చనీయాంశంగా మారిన వక్ఫ్ సవరణ బిల్లుకు పార్లమెంటులో ఆమోద ముద్ర పడి పోయింది. పార్లమెంటులోని దిగువ…
తెలంగాణ కేబినెట్ విస్తరణ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే వస్తోంది. ఇప్పటికే మొన్నామధ్య సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్…
జనసేన కీలక నేత, ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ నిజంగానే విభిన్న పంథాతో సాగే నేత. ఇప్పటిదాకా…
ఏపీలో అధికార కూటమి మిత్ర పక్షాల మధ్య వక్ఫ్ బిల్లు వ్యవహారం.. తేలిపోయింది. నిన్న మొన్నటి వరకు దీనిపై నిర్ణయాన్ని…
హెడ్డింగ్ చూసి ఇదేం ప్రశ్న అనుకుంటున్నారా. నిర్మాత సాజిద్ నడియాడ్ వాలా భార్య వార్దా ఖాన్ వరస చూస్తే మీకూ…