నందమూరి అభిమానులు ఎదురుచూసే కొద్దీ మోక్షజ్ఞ ఎంట్రీ లేట్ అవుతూనే ఉంది. గత ఏడాది ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్యాన్ ఇండియా మూవీ ప్రకటించి, ఫోటో షూట్ చేసి, ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా వదిలారు. రేపు పూజ అనగా ముందు రోజు రాత్రి క్యాన్సిల్ చేశారు. కొంత అనారోగ్యంతో పాటు మంచి ముహూర్తం కోసం వాయిదా వేశామని బాలయ్య చెప్పినప్పటికీ ఆ తర్వాత సంక్రాంతి, ఉగాది పండుగలు వచ్చి వెళ్లాయి కానీ ఫ్యాన్స్ ఎదురు చూసింది మాత్రం జరగలేదు. ఇంకోవైపు ప్రశాంత్ వర్మ తన ప్రొడక్షన్ సినిమాలతో పాటు జై హనుమాన్ పనుల్లో బిజీ అయిపోయాడు. ఇంకో రెండేళ్ల వరకు దొరకడం అనుమానమే.
రెండో సినిమా టేకప్ చేస్తాడని ప్రచారం జరిగిన వెంకీ అట్లూరి కోలీవుడ్ హీరో సూర్యతో కమిటైపోయాడు. ఆ తర్వాత చిరంజీవి, దుల్కర్ సల్మాన్, ధనుష్ లకు వేర్వేరు కథలు సిద్ధం చేసే పనిలో ఉన్నాడు. సో ఈ ఛాన్స్ లేనట్టే. మరో మోక్షజ్ఞ కోసం ఏ దర్శకుడు అందుబాటులో ఉంటాడంటే చెప్పడం కష్టమనేలా పరిస్థితి మారిపోయింది. ఇంతకు ముందు తరచు బయట కనిపించే మోక్షజ్ఞ ఇప్పుడు ఆ దర్శనం కూడా ఇవ్వడం లేదు. మూడు పదుల వయసు అందుకున్న మోక్షు ఇప్పటికే చాలా వెయిట్ చేయించాడని, ఇకనైనా త్వరగా నిర్ణయాలు తీసుకోమని బాలయ్య ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.
ఆదిత్య 369 సీక్వెల్ తప్పకుండ ఉంటుందని బాలయ్య నిన్న రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పారు. అందులో మోక్షజ్ఞ ఉంటాడని నెలల క్రితం జరిగిన ఒక ఇంటర్వ్యూలో అన్నారు కానీ నిన్న ఆ ప్రస్తావన రాలేదు. జస్ట్ సీక్వెల్ కన్ఫర్మ్ చేసి టాపిక్ అక్కడితో ముగించారు. ఏది ఏమైనా మోక్షజ్ఞ నిజంగానే సీరియస్ గా పరిశ్రమలోకి రావాలనుకుంటున్నాడా లేదానేది వీలైనంత త్వరగా డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే పోటీ ప్రపంచంలో మార్కెట్ సృష్టించుకోవడానికి సంవత్సరాలు పడుతుంది. ఒక్క సినిమాతో అయ్యేపని కాదు. బాలయ్య కార్డు డెబ్యూకి పనికొస్తుంది కానీ ఆ తర్వాత కష్టపడాల్సింది మోక్షజ్ఞనే. ఈ సస్పెన్స్ ఎప్పుడు వీడుతుందో.
This post was last modified on March 31, 2025 8:38 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…