టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్లలో ముందు వరసలో ఉన్న శ్రీలీల గుంటూరు కారం తర్వాత చాలా గ్యాప్ తీసుకుని రాబిన్ హుడ్ చేసింది. దీని ఫలితమూ నిరాశపరిచింది. హిట్టు ఫ్లాపు పక్కనపెడితే దర్శకులు తనకు ఒకే తరహా పాత్రలు ఇస్తూ డాన్సులకు పరిమితం చేస్తున్న వైనాన్ని వీలైనంత త్వరగా గుర్తించడం మంచిది. ఇదిలాగే కొనసాగితే పూజా హెగ్డే లాగా అవకాశాలు క్రమంగా తగ్గిపోతాయి. వర్తమానం సంగతి పక్కపెడితే గతంలో ఎక్స్ ట్రాడినరి మ్యాన్, ఆదికేశవ, స్కందలో తన క్యారెక్టర్ల తీరుతెన్నులు గమనిస్తే ఇంచుమించు అన్నీ ఒకేలా ఉంటాయి బాక్సాఫీస్ ఫలితాలతో సహా. అలాని తనదొకటే బాధ్యతని కాదు.
ఏ హీరోయిన్ అయినా హీరో కాంబో కన్నా ముందుగా చూడాల్సింది కథలో ప్రాధాన్యత. ఒకే తరహా మూస రోల్స్ ఒకదశ దాటాక ప్రేక్షకులకు బోర్ కొట్టేస్తాయి. ధమాకాలో వర్కౌట్ అయ్యింది కానీ ప్రతిసారి జరగదు కదా. భగవంత్ కేసరి పెద్ద హిట్టే కాదనడం లేదు కానీ అందులో తను మెయిన్ హీరోయిన్ కాదు. బాలయ్యతో ఒక ముఖ్యమైన బంధాన్ని పంచుకునే ఎమోషనల్ పాత్ర. కానీ పెర్ఫార్మన్స్ పరంగా శ్రీలీలకు మంచి పేరు తీసుకొచ్చింది కూడా ఇదొక్కటే. గుంటూరు కారం పాటల పరంగా ఓకే కానీ కంటెంట్ పరంగా ఆశించిన ఫలితం అందుకోలేదు. తాజాగా రాబిన్ హుడ్ వీటి లిస్టులోకి చేరిపోయింది.
రవితేజ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ శ్రీలీల నటించిన మాస్ జాతర త్వరలోనే రిలీజ్ కానుంది.టైటిల్ ని బట్టి ఇందులో తనకు మరీ వైవిధ్యం దక్కపోవచ్చని అనిపిస్తోంది. అయితే శివకార్తికేయన్ పరాశక్తి మీద హోప్స్ పెట్టుకోవచ్చు. సుధా కొంగర దర్శకత్వం, టీజర్ లో చూపించిన విజువల్స్ అంచనాలు వేరేలా మార్చుతున్నాయి. కార్తీక్ ఆర్యన్ సరసన డెబ్యూ చేస్తూ నటిస్తున్న బాలీవుడ్ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతోంది. దీని మీద అమ్మడికి చాలా ఆశలున్నాయి. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ రీ స్టార్ట్ అయితే అందులో పాల్గొనాల్సి ఉంటుంది. త్వరలోనే ప్రారంభిస్తామని నిర్మాత రవిశంకర్ ఇటీవల చెప్పిన సంగతి తెలిసిందే.
This post was last modified on March 31, 2025 8:34 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…