హీరోయిన్నాక ఎప్పుడూ ఫిజిక్ మెయింటైన్ చేస్తూ గ్లామరస్‌గా కనిపిస్తూ ఉండాలి. వాళ్ల కెరీర్ మామూలుగా ఎన్నో ఏళ్లు సాగదు. అందులో లుక్ పరంగా ఏ చిన్న తేడా వచ్చినా ప్రేక్షకుల దృష్టి పక్కకు మళ్లుతుంది. అవకాశాలు తగ్గిపోతాయి. నిరంతరం ఫిజిక్ మెయింటైన్ చేయలేక, లుక్ తేడా కొట్టి చాలా వేగంగా ఫేడవుట్ అయిపోయిన హీరోయిన్లు చాలామందే ఉన్నారు.
బాల నటిగా ‘చిన్నారి పెళ్ళికూతురు’ సీరియల్‌తో ఆకట్టుకుని.. ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో అరంగేట్రంలోనే అదరగొట్టిన అవికా గోర్ పరిస్థితి కూడా దాదాపు ఇలాగే అయింది. టాలీవుడ్లో డెబ్యూతోనే ప్రామిసింగ్‌గా అనిపించిన అవికా.. ఆ తర్వాత ‘సినిమా చూపిస్త మావ’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ లాంటి హిట్ సినిమాల్లో నటించింది. కానీ ఉన్నట్లుండి ఆమె ఇండస్ట్రీ నుంచి అంతర్ధానం అయిపోయింది.
హిట్లు వస్తున్నా కూడా అవికాకు అవకాశాలు ఆగిపోవడానికి కారణం ఆమె లుక్ తేడా కొట్టడమే. బాగా లావై షేప్ ఔట్ కావడంతో అవికాను పట్టించుకోవడం మానేశారు. ఈ విషయంలో తనలో తాను ఎంతో వేదన అనుభవించినట్లు అవికా తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది.
‘‘గత ఏడాది ఒక రోజు రాత్రి అద్దంలో నన్ను నేను చూసుకుంటే చాలా బాధేసింది. ఏడ్చేశాను. ఆ క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేను. అప్పుడు నా శరీరం నాకు అస్సలు నచ్చలేదు. దానికి నేను తగినంత గౌరవం ఇవ్వలేదు. అందుకే లావైపోయా. నా శరీర ఆకృతి విషయంలో ఎన్నోసార్లు బాధపడ్డాను. ఇలాంటి ఎన్నో ఆలోచనలు నాకు మనశ్శాంతి లేకుండా చేశాయి. అయితే ఏదీ ఒక్క రాత్రిలోనే మారిపోదని అర్థం చేసుకున్నాను. మంచి ఆహారం, వర్కవుట్ల మీద దృష్టి సారించాను. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ నేను ఆగలేదు. నా చుట్టూ ఉన్న వాళ్లు కూడా నాకు సహాయం చేశారు. నేను మారాను. ఈ రోజు మళ్లీ అద్దంలో చూసుకుని ఎంతో అందంగా ఉన్నావని నాకు నేను చెప్పుకున్నా’’ అని అవికా చెప్పింది. అయితే లుక్ మార్చుకున్నప్పటికీ తెలుగులో అయితే అవికాకు అవకాశాలు లేనట్లే ఉంది. ఆమె కెరీర్ మళ్లీ ఎప్పుడు పుంజుకుంటుందో చూడాలి.
This post was last modified on October 30, 2020 5:40 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…