మార్చి ముగిసిపోయింది. వేసవికి ముందొచ్చే నెలగా బాక్సాఫీస్ దీన్ని కీలకంగా పరిగణిస్తుంది. ముఖ్యంగా పిల్లల పరీక్షలు అయిపోయి సెలవులు ప్రారంభమవుతాయి కాబట్టి థియేటర్లకొచ్చే ఫ్యామిలీల సంఖ్య పెరుగుతుంది. దానికి అనుగుణంగానే రిలీజులు ప్లాన్ చేసుకుంటారు. కోర్ట్ మంచి బోణీ కొట్టగా మ్యాడ్ స్క్వేర్ అంచనాలకు మించిన విజయంతో ఏకంగా రికార్డు వసూళ్లు రాబడుతోంది. ఇప్పుడు అందరి దృష్టి ఏప్రిల్ వైపు వెళ్తోంది. కాకపోతే ముందు వస్తాయని చెప్పిన ప్యాన్ ఇండియా మూవీస్ ఘాటీ, కన్నప్ప వాయిదా పడటం ట్రేడ్ వర్గాలకు, సినీ ప్రియులకు నిరాశ కలిగించింది. దీంతో పోటీ తీవ్రత తగ్గింది.
ముందుగా చెప్పుకోదగ్గ వాటి గురించి మాట్లాడుకుంటే ఏప్రిల్ 10 సిద్దు జొన్నలగడ్డ ‘జాక్’తో పరీక్ష మొదలవుతుంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ స్పై ఎంటర్ టైనర్ లో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది. అదే రోజు అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ని తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు మైత్రి మూవీ మేకర్స్ ఏర్పాట్లు చేస్తోంది. నెక్స్ట్ డే ఏప్రిల్ 11 యాంకర్ ప్రదీప్ ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ వస్తోంది. హైప్ క్రమంగా పెరుగుతోంది. ఆపై వారం 17 రిలీజయ్యే తమన్నా ‘ఓదెల 2’ ప్రమోషన్లు ఊపందుకున్నాయి. మార్కెట్ లో మంచి క్రేజ్ వచ్చిందని బయ్యర్స్ టాక్. మరుసటి రోజు ప్రియదర్శి ‘సారంగపాణి జాతకం’ మీద బజ్ ఎక్కువ లేకపోయినా పబ్లిసిటీ ద్వారా దాన్ని పెంచే ప్రయత్నాలు మొదలయ్యాయి.
కన్నప్ప తప్పుకోవడంతో దాని స్థానంలో రావాలనుకున్న ‘భైరవం’ ఏప్రిల్ 25 వచ్చే సూచనలు పెరిగాయి. నిర్మాణ సంస్థ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ ఇంకో నాలుగైదు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఇవి కాకుండా ఏప్రిల్ నెలలో వచ్చే చిన్న మరియు మీడియం రేంజ్ సినిమాల్లో చౌర్య పాఠం, 28 డిగ్రీస్ సెల్సియస్, లవ్ యువర్ ఫాదర్, ఎర్రచీర లాంటివి ఉన్నాయి. ఇవన్నీ కంటెంట్ మెప్పిస్తే తప్ప థియేటర్లకు జనాన్ని రప్పించలేవు. ప్రమోషన్లు ఎంత బాగా చేసుకుంటే అంత రీచ్ వస్తుంది. మరి మండువేసవి తొలినెలలో విజేతలు ఎవరవుతారోననేది ఆసక్తికరంగా మారింది.
This post was last modified on April 1, 2025 5:41 pm
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…