నితిన్ లేటెస్ట్ రిలీజ్ రాబిన్ హుడ్ బాక్సాఫీస్ ఫలితం చేదుగా వచ్చేసింది. ఎడతెరిపి లేకుండా ప్రమోషన్లు చేసినా, డేవిడ్ వార్నర్ ని తీసుకొచ్చి పబ్లిసిటీలో భాగం చేసినా లాభం లేకపోయింది. మంచి వినోదం ఇస్తాడని పేరు తెచ్చుకున్న దర్శకుడు వెంకీ కుడుముల నుంచి ఇలాంటి అవుట్ పుట్ రావడం చూసి ఇండస్ట్రీ జనాలు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే అనిల్ రావిపూడి తర్వాత ఎంటర్ టైన్మెంట్ పరంగా అంత ముద్ర ఇతను వేయగలడనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది. ఇప్పుడది తగ్గింది. ఇంకోవైపు ఫ్లాపులకు అడ్డుకట్ట పడుతుందనుకున్న నితిన్ మళ్ళీ ఎదురుచూపుల్లో ఉండాల్సి వస్తోంది.
దీని సంగతలా ఉంచితే నితిన్ తర్వాతి సినిమా తమ్ముడు సిద్ధమవుతోంది. దిల్ రాజు నిర్మాణంలో పెద్ద బడ్జెట్ తో దీన్ని రూపొందిస్తున్నారు. ఒక యాక్షన్ ఎపిసోడ్ కోసమే రెండు కోట్లు ఖర్చు పెట్టారనే వార్త ఆ మధ్య హాట్ టాపిక్ గా మారింది. వకీల్ సాబ్ తర్వాత చాలా గ్యాప్ వచ్చేసిన దర్శకుడు వేణు శ్రీరామ్ ఈసారి ఫ్యామిలీ ఎలిమెంట్స్, యాక్షన్ మిక్స్ చేసుకుని తమ్ముడు రాసుకున్నాడు. అక్క తమ్ముడు సెంటిమెంట్ ఓ రేంజ్ లో పేలుతుందని ఇన్ సైడ్ టాక్. సీనియర్ నటి లయ, నితిన్ కాంబో చాలా బాగా వచ్చిందని అంటున్నారు. కాంతార ఫేమ్ సప్తమి గౌడ హీరోయిన్ గా నటించింది.
ఇక్కడిదాకా బాగానే ఉంది తమ్ముడుని త్వరగా తీసుకురావడం సేఫేనా అంటే ఔననే చెప్పాలి. ఎందుకంటే నితిన్ కు అర్జెంట్ గా డ్యామేజ్ రిపేర్ జరగాలి. ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాతో మళ్ళీ రేసులోకి తిరిగి రావాలి. ఎలాగూ ఎల్లమ్మకు కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఈలోగా ఒక పెద్ద హిట్టుతో బ్రేక్ తీసుకుంటే బిజినెస్ పరంగా తర్వాతి చిత్రాలకు ఉపయోగపడుతుంది. ట్రైలర్ చూశాక అంచనాలు మారిపోతాయని దిల్ రాజు తన సన్నిహితులతో అంటున్న మాట హైప్ పెంచుతోంది. ఒకవేళ ఏదైనా కారణం వల్ల హరిహర వీరమల్లు కనక మే 9 రాకపోతే తమ్ముడుని అదే డేట్ కి దింపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
This post was last modified on March 30, 2025 8:55 pm
మన దగ్గరేమో ప్యాన్ ఇండియా సినిమాలు విపరీతమైన ఆలస్యాలకు లోనవుతూ, విడుదల తేదీలు మార్చుకుంటూ నానా తిప్పలు పడుతున్న వైనాన్ని…
నిజమే... జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం ఒక్కటంటే ఒక్క మాటతో ఆ రెండు గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. మరికొన్నాళ్లుంటే...…
కంటెంట్ కన్నా ఎక్కువ వివాదాలతో వార్తల్లో నిలిచిన లూసిఫర్ సీక్వెల్ ఎంపురాన్ 2 తాజాగా ఇరవైకి పైగా కత్తిరింపులు, రెండు…
గత ఏడాది డిసెంబర్లో విడుదలై ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్ సాధించిన పుష్ప 2 ది రూల్ కొనసాగింపు పుష్ప…
తెలంగాణలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారం దుమారం రేపిన సంగతి తెలిసిందే. పరీక్ష మొదలైన…
తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తరచుగా పెద్ద పెద్ద వివాదాలే చోటు చేసుకుంటున్నాయి. గత ఏడాదంతా…