Movie News

అర్ధరాత్రి వేళ సికందర్ పైరసీ కలకలం

ఇవాళ సల్మాన్ ఖాన్ సికందర్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయ్యింది. ప్రమోషనల్ కంటెంట్ బజ్ ని పెంచలేకపోయినా కండల వీరుడి మాస్ ఖచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తుందనే నమ్మకం దర్శక నిర్మాతల్లో కనిపించింది. అయితే ఇండియాలో మొదటి షో పడకముందే అర్ధరాత్రి పైరసీ ప్రత్యక్షం కావడంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ షాక్ తిన్నారు. సమాచారం అందుకున్న నిర్మాత సాజిద్ నడియాడ్ వాలా వేంటనే రంగంలోకి దిగి తన బృందం సహాయంతో ఆరు వందలకు పైగా సైట్లలో లింకులు తీయించినా సరే అప్పటికే ప్రింట్ రకరకాల మాధ్యమాల ద్వారా వైరలైపోయి చాలా దూరం వెళ్ళింది.

ఇది ఒకరకంగా ఇండస్ట్రీ చివరి ప్రమాద హెచ్చరికగా చెప్పాలి. ఎందుకంటే నిర్మాతలు ఇప్పటికైనా తమకు జరుగుతున్న నష్టాన్ని గుర్తించకపోతే భవిష్యత్తులో ఇవాళ మౌనంగా ఉన్న వాళ్లే బాధితులుగా మారొచ్చు. అలా జరగకుండా ఉండాలంటే అసలు మూలాలు ఎక్కడ ఉన్నాయో గుర్తించాలి. విదేశీ సర్వర్లు అయినా సరే ఐపి అడ్రెస్ ద్వారా అక్కడి ప్రభుత్వాలకు సమస్యని విన్నవించి నిందితులకు శిక్షలు పడేలా చూడాలి. స్పష్టమైన ఆడియోతో హెచ్డి ప్రింట్లు ఇలా వచ్చేయడం గత ఆరేడు నెలల నుంచి ఎక్కువయ్యింది. గేమ్ ఛేంజర్, పుష్ప 2, డాకు మహారాజ్ ఇలా అన్ని వీటిబారిన పడి నష్టపోయినవే.

గతంలో పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సైతం రిలీజ్ కు ముందే ప్రింట్ బయటికి రావడం అప్పట్లో సంచలనం. ఆ టైంలో ఫైవ్ జి, ఇంటర్ నెట్ ఇప్పుడంతా స్పీడ్ తో అందరికి అందుబాటులో లేవు. కానీ ఇప్పుడలా కాదు. టెలిగ్రామ్ లాంటి ఒక యాప్ ఉంటే చాలు సర్వం వచ్చి పడుతోంది. సికందర్ కు నెగటివ్ టాక్ ఎక్కువగా వినిపిస్తున్న నేపథ్యంలో వచ్చే వసూళ్లను కాపాడుకోవాలి అంటే ముందా పైరసీకి అడ్డుకట్ట చేయాలి. వందల కోట్లుపెట్టువాడి పెట్టే నిర్మాత, కష్టపడే తత్వమున్న దర్శకులు ఇలా వీళ్ళ శ్రమ మొత్తం బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. ఇప్పటికైనా అందరూ పైరసీ తీవ్రతన గుర్తించడం అత్యవసరం.

This post was last modified on March 30, 2025 1:45 pm

Share

Recent Posts

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

28 minutes ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

36 minutes ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

37 minutes ago

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

3 hours ago

భారత్ vs పాక్ ఫైనల్… ఈసారి అతను కనిపించడు

భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…

3 hours ago

వీసా చేతిలో ఉన్నా రద్దే… అమెరికా కొత్త చెకింగ్ ఇదే!

అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…

4 hours ago