ముందు వచ్చేది హరిహర వీరమల్లునే అయినా అభిమానులు ఎదురు చూస్తోంది మాత్రం ఓజి కోసమనేది ఓపెన్ సీక్రెట్. డిప్యూటీ సిఎం హోదాలో పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లినా ఫ్యాన్స్ దీని నినాదంతో హోరెత్తిస్తున్నారు. ఒకదశలో పవన్ అసహనం వ్యక్తం చేస్తున్న సందర్భాలు చాలానే కనిపిస్తున్నాయి. ఓజి గోల ఆపమంటూ ఆయనే వేడుకున్నా లాభం లేకపోయింది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా ఓజిని పూర్తి చేసి హమ్మయ్య అనుకోవాలని పవన్ భావిస్తున్నట్టు లేటెస్ట్ అప్డేట్. ఏప్రిల్, మే నెలలో వీలుని బట్టి తగినన్ని డేట్లు ఇచ్చి త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరిగేలా చూడాలని నిర్మాతకు సమాచారమిచ్చారట.
దానికి తగ్గట్టే దర్శకుడు సుజిత్, నిర్మాత డివివి దానయ్యలు సెప్టెంబర్ రిలీజ్ సాధ్యాసాధ్యాలను తీవ్రంగా పరిశీలిస్తున్నట్టు టాక్. ఒకవేళ అన్నీ అనుకూలంగా జరిగిపోతే ఓజి దర్శనం త్వరగానే ఉంటుంది. దీనివెనుక ఇంకో కారణం ఉంది. నెట్ ఫ్లిక్స్ తో చేసుకున్న ఓటిటి డీల్ ప్రకారం ఓజి ఈ ఏడాదిలోనే థియేట్రికల్ రిలీజ్ జరిగిపోవాలి. లేదంటే ముందు ఇస్తామన్న భారీ మొత్తంలో ఒప్పందం ప్రకారం కోత పడుతుంది. అందుకే అలా జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఓజి బాలన్స్ కు సంబంధించిన ప్లాన్ మారుస్తున్నారని వినికిడి. ఇప్పటిదాకా పవన్ అవసరం లేని సీన్లు, ఎపిసోడ్లు అన్నీ పూర్తయ్యాయి. హీరోవి మాత్రమే కొన్ని పెండింగ్.
ఇదంతా నిజమైతే మాత్రం పవన్ అభిమానులకు 2025 స్పెషల్ గా ఉండిపోతుంది. ఎందుకంటే తక్కువ గ్యాప్ లో రెండు రిలీజులు చూసే ఛాన్స్ దక్కుతుంది. ఇవి అయిపోతే పవన్ కు సినిమాల పరంగా ఉండే ఒత్తిడి తగ్గిపోతుంది. ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది కానీ అదేమంత అర్జెంట్ కాదు. పైగా రీమేక్ కావడంతో వేగంగానే పూర్తి చేయొచ్చు. గ్రీన్ సిగ్నల్ రావడం ఆలస్యం దర్శకుడు హరీష్ శంకర్ రంగంలోకి దిగేందుకు రెడీగా ఉన్నాడు. ఇక ఓజి సెప్టెంబర్ లో వస్తే ఆల్రెడీ షెడ్యూల్ చేసుకున్న ఇతర పెద్ద సినిమాలు ముందుకకో వెనక్కో మార్చుకునే అవకాశముంది. సైడివ్వకపోతే వాటికే రిస్కు మరి.
This post was last modified on March 29, 2025 4:18 pm
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు మారిపోయారంటూ ఆ పార్టీకి చెందిన నేతలు, కరడుగట్టిన అభిమానులే బలంగా చెబుతున్నారు.…
మనకు డాల్బీ సౌండ్ పరిచయమే కానీ డాల్బీ సినిమా ఎలా ఉంటుందో ఇంకా అనుభవం కాలేదు. ఇప్పటిదాకా విదేశాల థియేటర్లలో…
హనుమాన్ తర్వాత గ్యాప్ వస్తున్నా సరే తదేక దృష్టితో తేజ సజ్జ చేస్తున్న సినిమా మిరాయ్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…
క్రిస్టియన్ మత ప్రభోదకుడు పగడాల ప్రవీణ్ మృతి వ్యవహారం గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి…
నిన్న కన్నప్ప ప్రీమియర్ జరిగిందంటూ కొన్ని ఫోటో ఆధారాలతో వార్త బయటికి రావడంతో అభిమానులు నిజమే అనుకున్నారు. కానీ వాస్తవానికి…
వైసీపీ అధికారంలో ఉండగా…2019 నుంచి 2024 వరకు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ అదికారంలో ఉంది. ఇప్పుడూ…