Movie News

మొన్న మైక్ టైసన్…ఇవాళ డేవిడ్ వార్నర్

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న స్పోర్ట్స్ స్టార్లతో తెలుగు సినిమాల్లో అతిథి పాత్రలను చేయించడం మంచి ఆలోచనే. కానీ కథకు ఎంత వరకు సూటవుతాయి, ఎలాంటి ప్రభావం చూపిస్తాయనేది బాగా ఆలోచించి తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఫ్రీగా నటించరు. కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ ఇచ్చుకోవాలి. పైగా అదనపు ఖర్చులు. ఇవన్నీ తట్టుకోవడానికి నిర్మాతలు సిద్ధపడుతున్నారంటే కారణం ఆయా దర్శకుల మీద నిర్మాతల నమ్మకమే. మూడేళ్ళ క్రితం విజయ్ దేవరకొండ లైగర్ కోసం సుప్రసిద్ధ బాక్సర్ మైక్ టైసన్ ని తీసుకొచ్చి మాములు హడావిడి చేయలేదు. తీరా చూస్తే ఆయన పాత్రే మూవీకి మైనస్ అయ్యింది.

నిన్న రాబిన్ హుడ్ లో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ దర్శనమిచ్చాడు. ఇదేదో వరల్డ్ వైడ్ సెన్సేషన్ అనే రేంజ్ లో ప్రమోషన్లలో ఈ క్యామియో గురించి ఊదరగొట్టారు. తనకోసమే థియేటర్లకొచ్చి టికెట్లు కొంటారనే రేంజ్ లో పబ్లిసిటీ చేసుకున్నారు. తీరా చూస్తే క్లైమాక్స్ లో వచ్చే వార్నర్ నిరాశపరిచాడు. అది కూడా కొన్ని నిమిషాల పాటే కావడం ఫ్యాన్స్ ని ఉసురూమనిపించింది. దానికి తోడు రాబిన్ హుడ్ రిపోర్ట్స్ కూడా మిశ్రమంగా ఉండటంతో ఫైనల్ రిజల్ట్ గురించి టీమ్ ఆందోళనగా ఉంది. మార్నింగ్ షోలో `డేవిడ్ వార్నర్ ఎంట్రీకి భీభత్సమైన రెస్పాన్స్ కనిపించలేదు. కంటెంట్ వల్ల అప్పటికే కలిగిన ఫీలింగ్ దాన్ని తగ్గించేసింది.

దర్శకులు ఒకటి గుర్తుంచుకోవడం అవసరం. ఎంత ఇంటర్నేషనల్ స్టార్స్ అయినా సరే వాళ్లకు తెలుగు ప్రేక్షకుల్లో ముఖ్యంగా ఇప్పటి తరంలో ఎంత ఫాలోయింగ్ ఉందో గుర్తు చేసుకోవడం అవసరం. మైక్ టైసన్ పాత జనరేషన్ కు ఆరాధ్యుడే కానీ ఇప్పుడు కాదు. పైగా వివాదాల్లోనూ ఉన్నాడు. డేవిడ్ వార్నర్ కు మన దగ్గర ధోని, కోహ్లీ, రోహిత్ శర్మ కున్నంత అభిమాన గణం లేదు. అలాంటప్పుడు అతన్ని చూసి తెలుగు ఆడియెన్స్ ఊగిపోతారనుకోవడం లాజిక్ కు అందనిది. అంతగా క్రికెట్ సెంటిమెంట్ ని క్యాష్ చేసుకోవాలంటే మనోళ్లను తీసుకున్నా ఓ రేంజ్ లో ప్లస్ అయ్యేది కానీ ఆస్ట్రేలియా నుంచి పట్టుకురావడం వల్ల ఒరిగింది శూన్యం.

This post was last modified on March 29, 2025 11:12 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

బాబు మార్కు చొరవ ఎవ్వరికీ సాధ్యం కాదంతే!

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు మారిపోయారంటూ ఆ పార్టీకి చెందిన నేతలు, కరడుగట్టిన అభిమానులే బలంగా చెబుతున్నారు.…

6 minutes ago

డాల్బీ థియేటర్లు వస్తున్నాయ్….హైదరాబాద్ కూడా

మనకు డాల్బీ సౌండ్ పరిచయమే కానీ డాల్బీ సినిమా ఎలా ఉంటుందో ఇంకా అనుభవం కాలేదు. ఇప్పటిదాకా విదేశాల థియేటర్లలో…

56 minutes ago

మిరాయ్ మెరుపుల్లో దగ్గుబాటి రానా

హనుమాన్ తర్వాత గ్యాప్ వస్తున్నా సరే తదేక దృష్టితో తేజ సజ్జ చేస్తున్న సినిమా మిరాయ్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…

2 hours ago

పాస్టర్ ప్రవీణ్.. ఇంకో కీలక వీడియో బయటికి

క్రిస్టియన్ మత ప్రభోదకుడు పగడాల ప్రవీణ్ మృతి వ్యవహారం గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి…

2 hours ago

కన్నప్ప ప్రీమియర్ వెనుక కహానీ ఏంటంటే

నిన్న కన్నప్ప ప్రీమియర్ జరిగిందంటూ కొన్ని ఫోటో ఆధారాలతో వార్త బయటికి రావడంతో అభిమానులు నిజమే అనుకున్నారు. కానీ వాస్తవానికి…

3 hours ago

ఏపీపై అమిత్ షా ఫోకస్ పెరిగినట్టే

వైసీపీ అధికారంలో ఉండగా…2019 నుంచి 2024 వరకు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ అదికారంలో ఉంది. ఇప్పుడూ…

4 hours ago