ఎంత మంచి సినిమా తీసినా అపోజిషన్ వల్ల ప్రతిసారి వసూళ్లు ప్రభావితం చెందుతున్నాయనే ఆందోళన నిర్మాత నాగవంశీలో పలు సందర్భాల్లో కనిపించేది. డాకు మహారాజ్ కు పాజిటివ్ టాక్ వచ్చినా సంక్రాంతికి వస్తున్నాం ధాటికి ఎదురు నిలవలేదు. దీంతో బ్లాక్ బస్టర్ అనుకున్న చిత్రం సూపర్ హిట్ దగ్గర ఆగిపోయింది. అంతకు ముందు లక్కీ భాస్కర్ టైంలోనూ క, అమరన్ వల్ల ఎఫెక్ట్ అవ్వాల్సి వచ్చింది. గుంటూరు కారంని హనుమాన్ డామినేట్ చేయడం గుర్తేగా. ఇవే కాదు గతంలో జెర్సికి కాంచన కాంపిటీషన్ వల్ల సీడెడ్ లో ఆ మూవీ బ్రేక్ ఈవెన్ కాకపోవడం గురించి ఆయన చెప్పిన ఉదంతముంది.
ఈసారి మాత్రం నాగవంశీకి ఆ ఇబ్బంది కలగలేదు. అపోజిషన్ వాళ్ళు సింపతీ ప్లే చేసి ఓపెనింగ్స్ తెచ్చుకుంటున్నారని ఆ మధ్య ఒక చిన్నపాటి చర్చకు దారి తీసిన ఈ అగ్ర నిర్మాతకు తాజాగా మ్యాడ్ స్క్వేర్ రూపంలో ఆ సెంటిమెంట్ బ్రేక్ అయిపోయింది. రేసులో ఉన్న ఇతర మూడు సినిమాల మీద పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ ఈ సినిమా దూసుకుపోతోంది. ఏపీ తెలంగాణ నుంచే మొదటి రోజు అయిదు కోట్లకు పైగానే షేర్ వచ్చిందని ట్రేడ్ టాక్. శని ఆదివారాల్లో ఇంకా పెద్ద నెంబర్లు వస్తాయని నిన్న నాగవంశీ అన్నారు. చూస్తుంటే అది నిజమైనా అంతకంటే ఎక్కువ వచ్చినా ఎంత మాత్రం ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఎల్2 ఎంపురాన్ కు తెలుగులో ఆశించిన స్థాయిలో స్పందన లేదు. రాబిన్ హుడ్ రెండో రోజుకే వెనుకబడటం బయ్యర్లలో ఆందోళన రేకెత్తిస్తోంది. వీరధీరశూరకు టాక్ బాగున్నా అసలు రిలీజయ్యిందనే సంగతే చాలా మందికి తెలియనంతగా వీక్ ప్రమోషన్లు జరిగాయి. దానికి తోడు మొన్న ఉదయం మధ్యాన్నం షోలు పడకుండా ఆగిపోవడం ఆసక్తిని తగ్గించేసింది. సాయంత్రం నుంచి తిరిగి ప్రారంభమైనా అప్పటికే డ్యామేజ్ అయిపోయింది. సో మ్యాడ్ స్క్వేర్ ఓ రేంజ్ లో డామినేట్ చేయడంలో ఏ మాత్రం అనుమానం అక్కర్లేదు. ముఖ్యంగా ఏబి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ వేగంగా పడుతున్నాయి.
This post was last modified on March 29, 2025 10:29 am
విద్యాబాలన్.. బాలీవుడ్లో మంచి స్థాయి ఉన్న కథానాయిక. ఆమె కథానాయికగా మంచి ఫాంలో ఉన్న టైంలో తెలుగులో నటింపజేయడానికి ప్రయత్నాలు…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఈ ఏడాది సెప్టెంబరు 17తో 75 ఏళ్లు వస్తాయి. ప్రస్తుతం ఆయన వయసు 74…
రాబిన్ హుడ్ అంటే పెద్దోళ్లను దోచుకుని పేదోళ్లకు పెట్టేవాడు. ఈ పేరుతో ఓ తెలుగు సినిమా తెరకెక్కింది. రెండుసార్లు వాయిదా…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక వేత్తల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అరకు కాఫీని ప్రపంచానికి పరిచయం…
గత దశాబ్ద కాలంలో బహు భాషల్లో విజయాలు అందుకుని ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో పెద్ద రేంజికి ఎదిగిన కథానాయిక రష్మిక…
కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఏది చేసినా వైరల్ అయిపోతోంది. ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం కేంద్రంగా రాజకీయం చేస్తున్న కేతిరెడ్డి..…