బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి నిర్మాతలు పడుతున్న తంటాలు అన్ని ఇన్ని కావు. మాములుగా మన దగ్గర స్టార్ హీరో రిలీజ్ ఉందంటే టికెట్ రేట్లు రెండు మూడు వందలు పెంచినా సరే ఏ మాత్రం ఆలోచించకుండా వెంటనే కొనేస్తాం. ఆ మధ్య పుష్ప 2 ప్రీమియర్లు ఎనిమిది వందలన్నా సై అన్న అభిమానులు లక్షల్లో ఉన్నారు. కానీ హిందీలో అలా ఉండదు. సల్మాన్ ఖాన్ ఎంత పెద్ద స్టారో చెప్పనక్కర్లేదు. సికందర్ విడుదలంటే హడావిడి ఓ రేంజ్ లో ఉండాలి. ఓపెనింగ్స్ అదిరిపోవాలి. టికెట్లు కొనేందుకు పబ్లిక్ ఎగబడాలి. కానీ ఇంత పెద్ద స్టార్ కు సైతం జనాలను రప్పించేందుకు ఆఫర్లు ఇవ్వక తప్పడం లేదు.
మ్యాటర్ ఏంటంటే సికందర్ మొదటి రోజే చూడాలన్నా స్పెషల్ డిస్కౌంట్లు ఇస్తున్నారు. ఉదాహరణకు డిస్ట్రిక్ట్ యాప్ లో ఒక్కో యుజర్ కి ఫ్లాట్ 150 రూపాయలు కూపన్ ఇచ్చేస్తున్నారు. రెండు టికెట్లు కొంటే ఇది వర్తిస్తుందన్న మాట. బిసి సెంటర్స్ లో ఈ లెక్క ప్రకారం ఒక టికెట్ ఉచితంగా వచ్చినట్టే. అసలు సల్మాన్ రేంజుకు ఇలా చేయాల్సిన అవసరం ఉందా అంటే బజ్ తక్కువగా ఉన్నప్పుడు తప్పదు మరి. అయినా ఇలా జరగడం అక్కడ కొత్తేమి కాదు. ఆ మధ్య స్కై ఫోర్స్ కు కార్పొరేట్ బుకింగ్స్ చేశారనే కామెంట్స్ జోరుగా వినిపించాయి. రోజుల తరబడి చేసినా అది బ్లాక్ బస్టర్ కాలేకపోవడం వేరే స్టోరీ.
వన్ ప్లస్ వన్, కేవలం వంద రూపాయల మల్టీప్లెక్స్ టికెట్, నేషనల్ సినిమా డే ఇలా రకరకాల పేర్లతో పబ్లిక్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేయడం నార్త్ లో సర్వ సాధారణం అయిపోయింది. ఇంత చేసినా థియేటర్లు కిక్కిరిసిపోవడం లేదు. చావా, స్త్రీ 2, యానిమల్ లాగా యునానిమస్ టాక్ వస్తే ఏ ఇబ్బంది లేదు కానీ యావరేజ్ అన్నా సరే టికెట్లు తెగడం మహా కష్టంగా మారిపోయింది. మన సౌత్ లోనూ చిన్న సినిమాలకు ఇలాంటి స్ట్రాటజీలు ప్రయత్నించాలి. పెద్ద వాటికి అవసరం లేదు కానీ హైప్ లేని చిత్రాలకు ఆఫర్లు ఇవ్వడం ద్వారా అంతో ఇంతో ఆక్యుపెన్సీని పెంచొచ్చు. ఆ దిశగా ఆలోచిస్తే ఫలితాలు అందుకోవచ్చు.
This post was last modified on March 28, 2025 10:22 am
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…