మార్చి నెలాఖరులో మొదటి రౌండ్ బాక్సాఫీస్ ఫైట్ నిన్న పూర్తయ్యింది. భారీ అంచనాలు పెట్టుకున్న ఎల్2 ఎంపురాన్ ఇతర భాషల్లో ఏమో కానీ తెలుగులో మిక్స్డ్ టాక్ తెచ్చుకోవడంతో హిట్ అవుతుందా లేదానేది చెప్పడం కష్టంగానే ఉంది. యునానిమస్ గా బాగుందని అనిపించుకుని ఉంటే వేరేలా ఉండేలా కానీ డబ్బింగులుకు మిశ్రమ స్పందన సేఫ్ కాదు. ఇక ఆర్థిక సమస్యల కారణంగా మధ్యాహ్నం నుంచి ఆలస్యంగా మొదలైన వీరధీరశూర పార్ట్ 2 షోల నుంచి ఆశ్చర్యకరంగా మంచి టాక్ వినిపిస్తోంది. హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ ఖైదీ అంత కాకపోయినా అదే తరహాలో డీసెంట్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చారని అంటున్నారు.
ఇవాళ స్ట్రెయిట్ సినిమాల క్లాష్ జరుగుతోంది. నితిన్ హీరోగా రూపొందిన రాబిన్ హుడ్ మీద మంచి బజ్ ఉంది. తన కెరీర్ లోనే పెద్ద బడ్జెట్ కావడంతో ప్రమోషన్ల పరంగా తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ ఓపెనింగ్స్ కు దోహదపడేలా ఉంది. వెంకీ కుడుముల దర్శకత్వంతో పాటు శ్రీలీల గ్లామర్, మైత్రి నిర్మాణ విలువలు, ఇదిదా సర్ప్రైజు పాట మాస్ లో అంచనాలు పెంచుతున్నాయి. ఇక మ్యాడ్ స్క్వేర్ మీద యూత్ లో ఎంత క్రేజ్ ఉందో అడ్వాన్స్ బుకింగ్స్ తేటతెల్లం చేస్తున్నాయి. ఒకవేళ మ్యాడ్ 1 లాగా పాజిటివ్ టాక్ వస్తే కలెక్షన్ల వర్షం ఖాయం. పబ్లిసిటీ రూపంలో దీనికి అవసరమైన బజ్ కంటే ఎక్కువే రావడంతో టీమ్ హ్యాపీగా ఉంది.
ఓవర్సీస్ నుంచి ప్రాధమికంగా అందిన రిపోర్ట్స్ ప్రకారం రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్ ఎర్లీ రిపోర్ట్స్ బాగుండటం శుభసూచకం. కాకపోతే మన దగ్గరా అలాంటి రెస్పాన్సే రావడం కీలకం కనుక దాని తాలూకు ఫలితం మధ్యాన్నం లోగా వస్తుంది. మార్చి నెలలో కోర్ట్ తర్వాత మళ్ళీ అంత చెప్పుకునే స్థాయిలో ఏ సినిమా రాలేదు. దీంతో థియేటర్ల ఫీడింగ్ ఇబ్బందికరంగా మారింది. పేరుకు గత వారం ఏడెనిమిది సినిమాలు రిలీజయ్యాయి కానీ ఒక్కటి కూడా కనీస స్థాయిలో మెప్పించలేక రెండో రోజే చేతులు ఎత్తేశాయి. సో ఉగాది, రంజాన్ పండగలతో కళకళలాడుతున్న వీకెండ్ లో ఎలాంటి రిజల్ట్స్ వస్తాయో వేచి చూడాలి.
This post was last modified on March 28, 2025 10:05 am
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…