Movie News

మెగా 158 – శరవేగంగా ‘శంకర్ వరప్రసాద్’

వేగంగా తీసినా బ్లాక్ బస్టర్లు కొట్టడంలో దిట్టగా పేరు తెచ్చుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి త్వరలోనే చిరంజీవితో ఒక మెగా మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఉగాది రోజు దీనికి శ్రీకారం చుట్టబోతున్నట్టు సమాచారం. రామానాయుడు స్టూడియోస్ వేదికగా భారీ ఎత్తున ప్లాన్ చేసినట్టు తెలిసింది. నిర్మాత సాహు గారపాటికి ఇది ప్రతిష్టాత్మక చిత్రం కావడంతో ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటీవలే ఫస్ట్ హాఫ్ లాక్ చేసినట్టు అప్డేట్ ఇచ్చిన రావిపూడి తాజాగా ఫైనల్ నెరేషన్ అయిపోయిందని ఎక్స్ వేదికగా ఫ్యాన్స్ తో పంచుకోవడంతో వాళ్ళతో సహా ఆశ్చర్యపోవడం అందరి వంతయ్యింది.

ఇందులో చిరంజీవి పాత్ర పేరు శంకర వరప్రసాద్ అని, దాన్ని పరిచయం చేస్తూ ఫైనల్ నెరేషన్ ఇచ్చానని చెప్పడంతో ఒక్కసారిగా మెగాబిమానులు అలెర్ట్ అయిపోయారు. కారణం ఆయన అసలు పేరుని ఇలా పూర్తిగా వాడిన డైరెక్టర్లు లేరు. ఆ రకంగా కూడా ఇది ప్రత్యేకత సంతరించుకుంటోంది. రాయలసీమ స్లాంగ్ లో చిరు పాత్ర చాలా ఎంటర్ టైనింగ్ గా కొత్తగా ఉంటుందని ఇన్ సైడ్ టాక్. డైలాగుల పరంగా హిలేరియస్ కామెడీ పండేలా అనిల్ రావిపూడి రాసుకున్న ఎపిసోడ్స్ ఓ రేంజ్ లో వచ్చాయని అంటున్నారు. మెగాస్టార్ టైమింగ్ వీటికి తోడై థియేటర్లలో నవ్వులు పూయడం ఖాయమని అంటున్నారు.

2026 సంక్రాంతి విడుదలను లాక్ చేసుకున్న ఈ మెగా మూవీని డిసెంబర్ ప్రారంభంలోపే పూర్తి చేయాలని టీమ్ టార్గెట్. దానికి అనుగుణంగా మొత్తం ప్లానింగ్ జరిగిపోయింది. సంక్రాంతికి వస్తున్నాంకి పాటించిన స్ట్రాటజీనే అనిల్ రావిపూడి మళ్ళీ ఫాలో కాబోతున్నాడు. నాలుగు పాటలు ఆల్రెడీ సిద్ధమయ్యాయట. భీమ్స్ నుంచి నెక్స్ట్ లెవెల్ ఆల్బమ్ వస్తుందనే అంచనాలు బలంగా ఉన్నాయి. విశ్వంభర రిలీజ్ డేట్ వ్యవహారం ఇంకా తేలకుండానే రావిపూడి సినిమా గురించి హైప్ రావడం మాములు విషయం కాదు. హీరోయిన్లు ఎవరనేది పండగ రోజు ప్రకటిస్తారేమో ఓ వారం దాకా వేచి చూడాలి.

This post was last modified on March 26, 2025 7:16 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఆఫర్లు ఇస్తే తప్ప టికెట్లు కొనరా

బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి నిర్మాతలు పడుతున్న తంటాలు అన్ని ఇన్ని కావు. మాములుగా మన దగ్గర స్టార్ హీరో రిలీజ్…

2 hours ago

గుండె తరలింపునకు లోకేశ్ ‘సొంత’ విమానం

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ సేవా కార్యక్రమాలు అంతకంతకూ విస్తరిస్తున్నాయి. ఇప్పటికే తన మనసుకు…

3 hours ago

రాజమౌళి వేసిన ముద్ర అలాంటిది

బాలీవుడ్ కు గ్యాంగ్స్ అఫ్ వసేపూర్, బ్లాక్ ఫ్రైడే ఇచ్చిన దర్శకుడిగా అనురాగ్ కశ్యప్ కు మంచి పేరుంది. ఇప్పుడంటే…

3 hours ago

ప్రభాస్ పెళ్లి గురించి మళ్ళీ పుకార్లు

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ట్యాగ్ ఉన్న ప్రభాస్ పెళ్లి గురించి హఠాత్తుగా మళ్ళీ పుకార్లు మొదలైపోయాయి. హైదరాబాద్ కు…

4 hours ago

బన్నీ అట్లీ కాంబోలో పునర్జన్మల ట్విస్టు ?

టాలీవుడ్ లో పునర్జన్మలది సక్సెస్ ఫుల్ ట్రాక్ రికార్డు. ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ కథతో వచ్చాయి. ఏఎన్ఆర్ మూగ…

4 hours ago

బిగ్ డే : రాబిన్ హుడ్ VS మ్యాడ్ స్క్వేర్

మార్చి నెలాఖరులో మొదటి రౌండ్ బాక్సాఫీస్ ఫైట్ నిన్న పూర్తయ్యింది. భారీ అంచనాలు పెట్టుకున్న ఎల్2 ఎంపురాన్ ఇతర భాషల్లో…

5 hours ago