కోర్ట్.. ఈ మధ్య కాలంలో చిన్న చిత్రాల్లో పెద్ద విజయం సాధించిన సినిమా. ఇందులో చెప్పుకోదగ్గ స్టార్ లేడు. కమెడియన్ టర్న్డ్ హీరో ప్రియదర్శి కీలక పాత్ర పోషించాడు. అతణ్నేమీ ఇందులో హీరోలా చూపించలేదు. ఒక టీనేజీ జంట చుట్టూ తిరిగే సినిమా ఇది. ఎక్కువగా కోర్టు వాదనల చుట్టూ కథ నడుస్తుంది. ఇలాంటి సినిమాలు తెలుగులో ఆడిన దాఖలాలు తక్కువ. ఐతేనేం పకడ్బందీ కథాకథనాలతో ఈ చిత్రం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. రిలీజ్‌కు ముందే పెయిడ్ ప్రిమియర్స్ నుంచి మంచి టాక్ రావడంతో సినిమాకు అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చాయి. తొలి వీకెండ్‌లో అంచనాలను మించి వసూళ్లు రాబట్టిన ‘కోర్ట్’.. ఆ తర్వాత కూడా బాక్సాఫీస్ దగ్గర బలంగా నిలబడింది.
తాజాగా రూ.50 కోట్ల గ్రాస్ మార్కును అందుకుని ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఓవరాల్ వసూళ్లు రూ.50 కోట్లను దాటడం ఒకెత్తయితే.. యుఎస్‌లో ఈ మూవీ మిలియన్ డాలర్ మార్కును అందుకోవడం మరో ఎత్తు. అక్కడ కాన్సెప్ట్ ఓరియెంటెడ్, క్లాస్ సినిమాలు మంచి వసూళ్లే సాధిస్తుంటాయి. కానీ ఇటీవల యుఎస్ బాక్సాఫీస్ బాగా డల్ అయింది. ట్రంప్ ప్రభుత్వం వచ్చాక పెట్టిన ఆంక్షలతో వేలాదిమంది తెలుగు వాళ్లు ఇంటిముఖం పట్టాల్సిన పరిస్థితి తలెత్తింది. ఉద్యోగాలు పోయిన వాళ్లు కొందరైతే.. పార్ట్ టైం ఉద్యోగాలకు దూరమై ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డవాళ్లు ఇంకొంతమంది.
ఈ ప్రభావం యుఎస్‌లో రిలీజయ్యే తెలుగు చిత్రాల మీద పడింది. వసూళ్లు గణనీయంగా తగ్గిపోయాయి. దీంతో కొన్ని చిన్న సినిమాలను అక్కడ రిలీజ్ చేయడమే ఆపేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ‘కోర్ట్’ లాంటి చిన్న చిత్రం మిలియన్ డాలర్ల క్లబ్బులో చేరడం అంటే అనూహ్యమే. కంటెంట్ ఉన్న సినిమా ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆడుతుంది అని చెప్పడానికి ఇది ఉదాహరణ.
This post was last modified on March 26, 2025 3:23 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…