ఈ మధ్య తమిళ కథానాయిక ప్రియా భవాని శంకర్.. హరీష్ కళ్యాణ్ అనే తమిళ నటుడితో కలిసి చాలా క్లోజ్‌గా ఫొటోలు దిగి తామిద్దరం ప్రేమలో ఉన్నట్లుగా లవ్ సింబల్స్ పెట్టి సోషల్ మీడియాలో సందడి చేసింది. ఈ అమ్మాయి అతడితో ప్రేమలో పడిందా.. ఇది నిజమా అంటూ అందరూ ఆశ్చర్యపోయారు. తమిళ మీడియాలో కూడా ఈ మేరకు వార్తలొచ్చేశాయి. కానీ తీరా చూస్తే అదంతా ఓ సినిమా ప్రమోషన్లో భాగం అని తర్వాత తేలింది. ‘పెళ్ళిచూపులు’ రీమేక్ అనౌన్స్‌మెంట్ ముంగిట ఆ చిత్రానికి హైప్ తేవడానికి ప్రియ, హరీష్ కలిసి ఆడిన డ్రామా అది.
ఇప్పుడు ఓ తెలుగమ్మాయి కూడా ఇదే తరహా డ్రామా ప్లే చేసి అందరినీ ఫూల్స్‌ను చేసింది. ఆమె తాజాగా ఎంగేజ్మెంట్ రింగ్ ఉన్న చేతిని చూపిస్తూ తాను ఎంగేజ్ అయిపోయాననే సంకేతాలు ఇచ్చింది. దీంతో ఆమెకు కాబోయే వరుడెవరు అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది.
ఓవైపు రాహుల్ సిప్లిగంజ్‌తో అంత సన్నిహితంగా మెలిగి, ఇప్పుడు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటోందేంటి అనే చర్చ కూడా నడిచింది. కానీ ఆ చర్చకు త్వరగానే తెరదించేసిందామె. తాను ఎవరితో రింగు తొడిగించుకుందో ఈ రోజు ఆమె వెల్లడించింది. పునర్ణవికి జోడీగా ఒక వెబ్ సిరీస్‌లో నటిస్తున్న ఉద్భవ్ రఘునందనే ఆ వ్యక్తి అని ఈ రోజు అసలు విషయం బయటపెట్టింది. వీళ్లిద్దరూ కలిసి ‘ఆహా’ కోసం ఒక వెబ్ సిరీస్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ ‘రింగ్’ డ్రామాను ప్లే చేశారన్నమాట.
యూట్యూబ్‌లో చికాగో సుబ్బారావుగా రఘునందన్ జనాలకు బాగానే పరిచయం. అతను పునర్ణవి నటిస్తున్న వెబ్ సిరీస్‌తో డిజిటల్ డెబ్యూ చేయబోతున్నాడు. దీని గురించి ఇంతకుముందే సమాచారం బయటికొచ్చింది. త్వరలోనే ఆ వెబ్ సిరీస్‌కు ప్రిమియర్స్ పడనున్న నేపథ్యంలో దానికి హైప్ తీవడానికి ఈ ‘రింగ్’ డ్రామాను ప్లే చేసి అందరినీ ఫూల్స్‌ను చేసింది పునర్ణవి.
This post was last modified on October 29, 2020 6:10 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…